news18-telugu
Updated: October 1, 2019, 9:14 AM IST
దీనిపై తర్వాత బాలయ్య కూడా చాలా సీరియస్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ అయితే ఎవడికి.. ఏం కొమ్ములు లేవు కదా అంటూ సీరియస్ అయ్యాడు కూడా. బాలయ్య సినిమాను ఒప్పుకోని అమితాబ్ బచ్చన్.. ఆ తర్వాత చిరంజీవి కోసం సైరా సినిమా చేసాడు. అందులో గోసై వెంకన్న పాత్రలో నటించాడు. అది చిరుతో ఆయనకున్న అనుబంధమే కారణం.
ఒకప్పుడు తెలుగు హీరోలు ..హిందీలో నటిస్తే గొప్పగా ఫీలయ్యేవారు. కానీ ఇపుడు బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘బాహుబలి’ పుణ్యమా అని తెలుగు సినిమాకు నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు లభించింది. దీంతో అక్కడి బడా హీరోలు సైతం సౌత్ ఇండస్ట్రీ సినిమాల్లో నటిస్తూ ఇక్కడ కూడా మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్..చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో యాక్ట్ చేసారు. అంతకు ముందు బిగ్ బీ.. అక్కినేని కుటుంబం మొత్తం నటించిన ‘మనం’లో కాసేపు తెరపై అలా కనిపించి కనువిందు చేసారు. అంతకు ముందు అమితాబ్.. కన్నడ, మలయాళ సినిమాల్లో యాక్ట్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది.

‘సైరా నరసింహారెడ్డి’లో అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)
తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’లో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ ఇంపాార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కూడా అంతకు ముందు ‘చంద్రలేఖ’ అనే సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. అంతేకాదు ఇపుడు యశ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కేజీఎఫ్2’లో అథిరా అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.

అజయ్ దేవ్‌గణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్
వీరితో పాటు అక్షయ్ కుమార్ తెలుగులో కాకుండా తమిళంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.O’లో పక్షిరాజు పాత్రలో నటించాడు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బాలీవుబ్ నటుడు వివేక్ ఓబరాయ్. ఇదే సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో అదరగొట్టారు బాలీవుడ్ షాట్‌గన్ శతృఘ్న సిన్హా. అంతకు ముందు ఒక తెలుగు సినిమాలో సిన్హా నటించాడు. తాజాగా వివేక్ ..రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే కదా.

రక్త చరిత్రలో వివేక్ ఓబరాయ్, శతృఘన్ సిన్హా
ఇక తెలుగులో డైరెక్ట్‌గా నటించిన హీరోల్లో అనిల్ కపూర్ కూడా ఉన్నాడు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశవృక్షం’లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఈ మిస్టర్ ఇండియా. ఇక అనిల్ కపూర్ తోటి నటుడు జాకీష్రాఫ్ తెలుగులో ‘అస్త్రం’,శక్తి’, ‘పంజా’, తాజాగా ‘'సాహో’లో నటించాడు.

అనిల్ కపూర్, జాకీష్రాఫ్
‘సాహో’ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్‌తో పాటు చుంకీ పాండేలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు నీల్ నితిన్ ముఖేష్.. బెల్లంకొండ నటించిన ‘కవచం’లో మొదటిసారి తెలుగు తెరపై కనిపించాడు. ఇంకోవైపు సీనియర్ బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నాకూడా నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన ‘బంగారు బాబు’లో గెస్ట్ అప్ఫీరియన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవి దొంగ’లో ఒక పాటలో రాజేష్ ఖన్నా తళుక్కున మెరిసారు.ఇంకోవైపు కృష్ణ హీరోగా నటించిన ‘దొంగల వేట’లో బాలీవుడ్ నటుడు జితేంద్ర కొన్ని నిమిషాల గెస్ట్ పాత్రలో నటించారు.

రాజేష్ ఖన్నా, జితేంద్ర (File Photo)
మరో బాలీవుడ్ సీనియర్ హీరో ‘షోలే’ లో ఠాగూర్ పాత్రధారి సంజీవ్ కుమార్ కూడా.. శారద ముఖ్యపాత్రలో నటించిన ‘ఊర్వశి’లో గెస్ట్ పాత్రలో మెరిసారు. ఇక దక్షిణాది చిత్రాల విషయానికొస్తే..బాలీవుడ్ నటుడు నానా పాటేకర్..రజినీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’తో దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చాడు.

అక్షయ్ కుమార్, నానా పాటేకర్
పెద్ద హీరోల విషయాన్ని పక్కనపెడితే సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ ఖాన్..చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవా’, రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి సినిమాల్లో విలన్‌గా నటించాడు. అటు ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి,ఊసరవెల్లి సినిమాలో విద్యుత్ జామ్వాల్ విలన్‌గా నటించాడు.ఇక అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ సినిమాతో భోజ్‌పురి హీరో కమ్ బాలీవుడ్ నటుడు రవికిషన్ శుక్లా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇపుడు ‘సైరా నరసింహారెడ్డి’లో ముఖ్యపాత్రలో నటించాడు. ఈ రకంగా చిన్నా చితక చాలా మంది బాలీవుడ్ హీరోలు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగులో తమ లక్‌ను పరీక్షించుకున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 1, 2019, 8:51 AM IST