బీర్లు తాగి లావెక్కడంతో ఆ సినిమా అవకాశం పోయింది : బాలయ్య భామ

Radhika Ampte :   'రక్త చరిత్ర', 'లయన్', 'లెజెండ్' సినిమాలతో తెలుగులో ఓ మెరుపు మెరిసి మాయమైన అందాల భామ. అందంతోనే కాకుండా, చక్కని అభినయంతోనూ ఆకట్టుకునే ఆప్టే ప్రస్తుతం బాలీవుడ్‌లో బాగానే అవకాశాలు రాబట్టుకుంటోంది.

news18-telugu
Updated: September 7, 2019, 4:53 PM IST
బీర్లు తాగి లావెక్కడంతో ఆ సినిమా అవకాశం పోయింది : బాలయ్య భామ
Instagram/radhikaofficial
  • Share this:
Radhika Ampte :   'రక్త చరిత్ర', 'లయన్', 'లెజెండ్' సినిమాలతో తెలుగులో ఓ మెరుపు మెరిసి మాయమైన అందాల భామ రాధికా ఆప్టే. అందంతోనే కాకుండా, చక్కని అభినయంతోనూ ఆకట్టుకునే ఆప్టే ప్రస్తుతం బాలీవుడ్‌లో బాగానే అవకాశాలు రాబట్టుకుంటోంది. మరాఠీ,హిందీ భాషలే కాకుండా సౌత్‌కి చెందిన మూడు భాషలలోనూ అనర్గళంగా మాట్లాడగలదు ఈ ముద్దుగుమ్మ. ఒక నటిగా ఎంత పేరుతెచ్చుకుందో అంతకన్నా ఎక్కువ వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది రాధిక. అందులో భాగంగా.. అప్పట్లో ఓ దక్షిణాది నటుడు తనను పడకగదికి పిలిచాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  'బద్లాపూర్', 'హంటర్', 'ప్యాడ్ మ్యాన్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన రాధిక.. ‘పార్చెడ్’ సినిమాలో నగ్నంగా నటించి వార్తల్లోకెక్కింది. ఆ సినిమాకు సంబందించిన నగ్న వీడియోలు ఇంటర్నెట్‌లో కూడా వైరల్‌గా మారాయి. అంతేగాక, రాధికా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. అందాలను అరబోయడంపైనా విమర్శలు ఎదుర్కొంటోంది. 

View this post on Instagram
 

I found the most obvious place on a boat to sit. 📷 @rekapalli #boat


A post shared by Radhika (@radhikaofficial) on

అది అలావుంటే అప్పట్లో అయుష్మాన్ ఖురానా.. 'విక్కీ డోనర్' అనే చిత్రానికి హీరోయిన్‌గా ఎంపికైన రాధిక.. ఆ సమయంలో అధికంగా బీర్ సేవించి లావు అయిపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవలసి వచ్చిందట. ఈ మాట స్వయంగా రాధికనే బయటపెట్టడం గమనార్హం. అంతేకాదు డబ్బు కోసం కొన్ని అసభ్యకర చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని, తనకు ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల సినిమాల్లో అవకాశాలు రాబట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని, ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, సినిమాల్లో అవకాశాలు కూడా మెండుగా వస్తున్నాయని తెలిపింది బాలయ్య భామ.
First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>