Home /News /movies /

BEAST MOVIE TWITTER REVIEW TAMIL STAR HERO VIJAY GOT ANOTHER SUCCESS AND PUBLIC RESPONCE IN TWITTER TA

Beast Movie Twitter Review : విజయ్ ‘బీస్ట్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..

విజయ్ ‘బీస్ట్’ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

విజయ్ ‘బీస్ట్’ ట్విట్టర్ రివ్యూ (Twitter/Photo)

Beast Movie Twitter Review : తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ రోజు తమిళం, తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
    Vijay - Beast Twitter Review | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)  గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేసారు. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి  పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ (Beast Trailer) చూస్తుంటే.. మాస్ అండ్ యాక్షన్ అంశాలతో వావ్ అనిపించింది. విజయ్‌ ఇండియన్‌ స్పై వీర రాఘవ అనే ఏజెంట్‌గా కనిపించి కేక పెట్టించారు.ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

    ఈ సినిమాలో విజయ్ భారత రా ఏజెంట్ పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో పాటు హిందీలో ఏక కాలంలో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. తమిళం, తెలుగు సహా అన్ని భాషల్లో ‘బీస్ట్’ టైటిల్‌తో విడుదలైతే.. హిందీలో మాత్రం ‘రా’ టైటిల్‌తో విడుదలైంది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉందో మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.




















    మొత్తంగా బీస్ట్ సినిమాకు తమిళనాడు సహా అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో సినిమా విడుదల సందర్భంగా థియేటర్స్‌లో హంగామా చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా ఫైనల్‌గా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
    ఈ చిత్రాన్ని తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజనెస్ విషయానికొస్తే..

    నైజాం (తెలంగాణ):  రూ. 3.50 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 2.1 కోట్లు
    ఆంధ్ర ప్రదేశ్: రూ. 4.40  కోట్లు
    ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ : రూ. 10 కోట్లు

    Kajal-Pranitha-Sonam : బిగ్‌బాస్ బ్యూటీ సహా కాజల్,ప్రణీత, సోనమ్ సహా ప్రెగ్నెంట్‌గా ఉన్న కథానాయికలు వీళ్లే.. అందులో ఒకరైతే మూడోసారి గర్భవతి..


    ఈ సినిమా తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 10.50 కోట్లు వసూళు చేయాలి. ఈ సినిమాకు పోటీగా కేజీఎఫ్ 2 గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను దిల్ రాజు (Dil Raju) దక్కించుకున్నారు. ఈ ట్రైలర్‌ను చూసిన నెటిజన్స్ మాత్రం.. ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ మాత్రం ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సిరీస్ మనీ హీస్ట్‌ను పోలి ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో విజయ్ .. వంశీ పైడిపల్లితో రీసెంట్‌గా తన 66వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Beast, Kollywood, RAW, Tollywood, Vijay

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు