BATHUKAMMA CELEBRATIONS IN BIGG BOSS 4 TELUGU HOUSE AND LASYA ARIYANA SUNG SONGS PK
Bigg Boss 4 Bathukamma Celebrations: బిగ్ బాస్ హౌజ్‌లో బతుకమ్మ సంబురాలు.. పాటలు చేసిన అరియానా, లాస్య..
బిగ్ బాస్ హౌజ్ల్ బతుకమ్మ సంబురాలు (bigg boss bathukamma)
Bigg Boss 4 Bathukamma Celebrations: తెలంగాణలో దసరా సీజన్ వచ్చిందంటే బతుకమ్మ సందడి కూడా మొదలైపోతుంది. ఆడపడుచులు అంతా కలిసి తలపై బతుకమ్మను మోస్తుంటారు. ఈ సంబురాలు దసరా నవరాత్రులు జరుగుతుంటాయి.
తెలంగాణలో దసరా సీజన్ వచ్చిందంటే బతుకమ్మ సందడి కూడా మొదలైపోతుంది. ఆడపడుచులు అంతా కలిసి తలపై బతుకమ్మను మోస్తుంటారు. ఈ సంబురాలు దసరా నవరాత్రులు జరుగుతుంటాయి. ప్రపంచమంతా బతుకమ్మ సంబురాలు జరుగుతుంటాయి. తెలంగాణకే పరిమితం అయినా కూడా అంతా ఈ పండగను ఆస్వాదిస్తున్నారు ఇప్పుడు. ఇదే ఆనవాయితీ బిగ్ బాస్ హౌజ్‌లో కూడా కొనసాగుతుంది. బతుకమ్మ సంబురాలను అక్కడ కూడా జరుపుకున్నారు అమ్మాయిలు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న లాస్య, అరియానా, మోనాల్ కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసారు. వాళ్లకు తోడుగా అవినాష్ కూడా ఉన్నాడు. ఇంట్లోనే ఉన్న రెండు ప్లాస్టిక్ పూలను తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి మధ్యలో ఉంచి బతుకమ్మ పాట పాడింది. ఆమెకు అరియానా, మోనాల్, అవినాష్ కోరస్ ఇచ్చారు. ఆ తర్వాత బయట ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి అదే ప్లేట్‌ను నీటిలో ఉంచి పూలను ఉంచారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ లాస్య పాడిన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. అరియానా, అవినాష్ కూడా లాస్యకు బాగానే సపోర్ట్ చేసారు. మొత్తానికి బిగ్ బాస్ హౌజ్‌లో కూడా దసరా సందడితో పాటు బతుకమ్మ కూడా సంబురాలు కూడా బాగానే జరిగాయి. ఇదిలా ఉంటే బతుకమ్మ ఆడిన ముగ్గురు అమ్మాయిలు అరియానా, లాస్య, మోనాల్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అవినాష్ కెప్టెన్ కాబట్టి బతికిపోయాడు కానీ లేదంటే ఆయన కూడా ఉండేవాడే.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.