Home /News /movies /

BAPU BIRTH ANNIVERSARY TOLLYWOOD LEGENDARY DIRECTOR BAPU BIRTH ANNIVERSARY SPECIAL TA

Bapu Birth Anniversary : టాలీవుడ్ లెజండరీ దర్శకుడు బాపు జయంతి నేడు.. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

దర్శకుడు బాపు జయంతి (Twitter/Photo)

దర్శకుడు బాపు జయంతి (Twitter/Photo)

Bapu Birth Anniversary :  తెలుగుతనానికి వన్నెలద్దిన చిత్రకారుడాయన.. తన చిత్రాలతో తెలుగు సంస్కృతిలో భాగమైన చిత్రకారుడాయన..బొమ్మలో ప్రత్యేక శైలితో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సాధించుకున్నారాయన... ఈ రోజు బాపు జయంతి సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం..

ఇంకా చదవండి ...
Bapu Birth Anniversary :  తెలుగుతనానికి వన్నెలద్దిన చిత్రకారుడాయన.. తన చిత్రాలతో తెలుగు సంస్కృతిలో భాగమైన చిత్రకారుడాయన..బొమ్మలో ప్రత్యేక శైలితో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సాధించుకున్నారాయన...ఆయనే బాపు. అచ్చతెలుగు అమ్మాయిని బాపుబొమ్మలా ఉంది అని మెచ్చుకునేస్థాయిలో ఆయన బొమ్మలు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయనెంత గొప్ప కళాకారుడో. ఆబాల గోపాలాన్ని, పండిత పామరులనూ అలరించి, ఆకట్టుకునే బొమ్మలు బాపూవి ఈ రోజు ఆయన జయంతి సందర్బంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం.. నవరసాల్ని ఒడిసిపట్టుకున్న కుంచె బాపుది... శాంతము, కరుణము, భయంకరము, భీభత్సము, రౌద్రం, అద్భుతం, వీరం, హాస్యం లాంటి నవరసాలకు రూపాన్నించిన ఘనత బాపుది. ఈ ఒక్క బొమ్మతో బాపులోని కళాకారుడిని అర్థం చేసుకోవచ్చు. ఆయన బొమ్మలే కాదు ఆయన చేతి రాత కూడా బాపూ ఫాంట్ గా గుర్తింపు పొందింది.

బాపు 1933 డిసెంబర్ 15 న జన్మించారు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరిజిల్లా నరసాపురం. తల్లి దండ్రుల వేణు గోపాలరావు, సూర్యకాంతమ్మ. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు .. సత్తిరాజు లక్ష్మి నారాయణ. కానీ ఈయన బాపు పేరుతో పాపులర్ అయ్యారు.  1955 వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా తీసుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర  దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. అయితే సినిమా దర్శకత్వంపై ఉన్న ఆసక్తితో 1967లో ‘సాక్షి’ అనే సినిమాకు దర్శకత్వం చేశారు.

అబ్బాయి రానాతో కాకుండా.. మరో స్టార్ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ..

ఇదే ఆయన మొదటి సినిమా. దర్శకత్వ శాఖలో ఎలాంటి అనుభవం లేకున్నా దర్శకుడిగా ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు బాపు. తన సినిమాతో ప్రత్యేక శైలిని క్రియేట్ చేసి ఇది బాపు మార్క్ సినిమా అనేల గుర్తుంపు తెచ్చుకున్నాడు.బాపు గురించి చెప్పుకునేటప్పుడు తప్పకుండా గుర్తు చెసుకోవాల్సిన పేరు ముళ్ళ పూడి వెంకట రమణది...వీరిద్దరి ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సాక్షి’ సినిమా నుండి బాపు సినిమాలకు రచయితగా పని చేసారు రమణ.

Balakrishna - Rajamouli : నాతో సినిమా ఎపుడు చేస్తావ్.. రాజమౌళికి బాలకృష్ణ సూటి ప్రశ్న.. అదిరిన జక్కన్న సమాధానం..


తెలుగుతనం చూడాలంటే బాపు, తెలుగు వినాలంటే ముళ్ళపూడి వెంకటరమణ అని వీరిద్దరూ పేరుపడ్డారు. అంతేకాదు బాపు ఇంటి పేరు రమణ, రమణ ఇంటి పేరు బాపు అనేంతగా వీరిద్దరి బందం ముడిపడిపోయింది. ముళ్ళపూడి రచించిన బుడుగుకు తన బొమ్మలతో సోగసులద్దారు బాపు... తెలుగు సాహిత్యంలో బుడుగుకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

NBK - Akhanda : బెజవాడ కనకదుర్గమ్మ మరియు పానకాల నరసింహా స్వామిని దర్శించుకున్న ‘అఖండ’ టీమ్..

బాపు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ గురించి, హీరోయిన్ ను బాపు చూపించినంత అందంగా, పద్ధతిగా, విభిన్నంగా మరే దర్శకుడు చూపించలేదు. తెలుగు తనం ఉట్టిపడుతు, ఆకట్టుకునే హవాభావాలతో, వాలుజడతో, ప్రేక్షకులను కట్టి పాడేస్తుంది బాపు హీరోయిన్.బాపు హిరోయిన్స్ కేవలం అందగత్తెలే కాదు గడుసైసవారు, తెలివైన వారు కూడా. బాపు సినిమా అనగానే హీరోయిన్ ఎవరా అని చూస్తారు ప్రేక్షకులు..అందుకే బాపు సినిమాలో నటించడానికి ఇండస్ట్రీలోని ప్రతీ హీరోయిన్ తహతహలాడుతుంది.

RRR : ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. 100 మిలియన్స్ వ్యూస్ దాటిన ట్రైలర్..

బాపు సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ముత్యాల ముగ్గు’.  ఈ సినిమా  ఒక అణిముత్యం...కోనసీమ అందాలు, తెలుగు బాష యాసలు, హిరోయిన్ అందం, అర్టిస్ట్‌ల పర్ఫామ్,సంగీతం, మూళ్ళపూడి రచన.. ఇవన్ని కలిసి సినిమాను ఓ క్లాసిక్‌గా మార్చేశాయి .బాపు దర్శకత్వంలోని సినిమాల్లో ఈ సినిమా ఓ మైలురాయి గా నిలిచిపోయింది. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా  నేషనల్ అవార్డ్ వచ్చింది.

దర్శకుడు బాపు (Twitter/Photo)


ఈ సినిమాలో ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రావు గోపాల్ రావు విలనిజం గురించి...బాపు సినిమాలలో విలన్ పాత్ర స్పెషల్ గా ఉంటుంది. అది ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. అందుకే ముత్యాలముగ్గు విలన్ గా రావుగోపాల్ రావు పాత్ర తెలుగు సినిమాల్లోని 10 బెస్ట్ విలన్ క్యారెక్టర్స్ లో ఒకటిగా తప్పకుండా ఉంటుంది.

Mahesh Babu - Namrata: మహేష్ బాబు, నమ్రత బాటలో గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న ఈ సినీ జంటలు తెలుసా..


1976లో వచ్చిన సీతాకళ్యాణం లండన్, చికాగో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లలో ప్రదర్శించారు ..బాపు దర్శకత్వంలో వచ్చిన  ఉత్తమ చిత్రాలలో ఇది ఒకటి. బాపు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడ సత్తా చాటారు.. ప్యార్ కా సింధూర్, దిల్ జలా, మేరా దరమ్, ప్యారీ బేహన, బేజుబాన్ లాంటి సినిమాలు తీసి హిందీ ప్రేక్షకులను అకట్టుకున్నారు. బాలీవుడ్ లో తన కంటూ స్థానం సంపాదించుకున్నారు.

దర్శకుడు బాపు (File/Photo)


స్వతహగా అర్టిస్ట్ కావడం వల్ల సినిమాకు ముందు స్టోరి బోర్డు అది కూడా బొమ్మల రూపంలో సీన్ టు సీన్ వేసుకునేవారట. అచ్చం అలాగే తెరపై చిత్రీకరించేవారట. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇలా చేసే దర్శకులు మరింకెవ్వరూ లేరు.‘మిస్టర్ పెళ్లాం’, ‘పెళ్ళి పుస్తకం’ లాంటి  సినిమాలలో భార్యాభర్తల ప్రేమ, అనురాగాలు, కీచులాటలు, రొమాన్స్‌ను  ఎంతో అందంగా చిత్రీకరించారు. మిడిల్ క్లాస్ జీవితాల్లోని  ఆర్థిక సమస్యలను, వాటిని అధిగమించడానికి వాళ్ళు పడే పాట్లు ఎంతో హృద్యంగా చిత్రీకరించారు. ఈయన సినిమాలో హీరో కన్నా హీరోయిన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

Vekantesh Remakes: ‘దృశ్యం 2’ సహా వెంకటేష్ ఫిల్మ్ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..


బాపును ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. 2001 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ పురస్కారం, రాష్ట ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులతో పాటు కళా ప్రపూర్ణ, పద్మశ్రీ లాంటి ఎన్నో అవార్డులు ఆయన కళకు దాసోహమన్నాయి. సాంఘిక చిత్రాలే కాకుండా, భక్తి రస చిత్రాలనూ తీశి ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు బాపు. ‘భక్త కన్నప్ప’,‘సీతా కళ్యాణం’, ‘సంపూర్ణ రామయణం’, ‘శ్రీ రామాంజనేయ యుద్దం’ ’శ్రీ రామ రాజ్యం’,లాంటి సినిమాలు ఆ కోవలోనివే.

బాపు చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’ (File/Photo)


‘శ్రీ రామ రాజ్యం’ సినిమా బాపు చేసిన చివరి చిత్రం. వెండితెర అద్భుతాలతో పాటు స్మాల్ స్క్రీన్  మీదా అద్భుతాలు చేశారు బాపు. భాగవతం ధారావాహికతో ఇంటింటికీ చేరుకున్నారు. ప్రతిఒక్కరికీ దగ్గరయ్యారు.తెలుగుబొమ్మకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సౌమ్యత్వం, పసితనపు చాయలు పోని చిరునవ్వు, నిబద్దత, ఆప్యాయ పలకరింపు బాపు నైజాలు. 2014 ఆగస్ట్ 31 బాపు మనందరినీ వదిలి వెళ్లారు. బాపు భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన వేసిన బొమ్మలో, సినిమాలో, ఆయన చేసిన ప్రతి పనిలోనూ మనతో ఉంటారు.(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు