Home /News /movies /

BAPPI LAHIRI DO YOU KNOW ABOUT REASONS OF WEAR GOLD LEGENDERY MUSIC DIRECTOR BAPPI LAHIRI HERE ARE THE DETAILS TA

Bappi lahiri : బప్పీలహరి ఒంటి నిండా బంగారు ధరించడానికి అసలు కారణం ఇదే..

గోల్డ్ మ్యాన్ ‘బప్పీలహరి’ (File/Photo)

గోల్డ్ మ్యాన్ ‘బప్పీలహరి’ (File/Photo)

Bappi lahiri : భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుల్లో బప్పీలహరికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన తన ఒంటి నిండా బంగారు నగలు ధరించడంపై పెద్ద కథే ఉంది.

    Bappi lahiri : భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుల్లో బప్పీలహరికి ప్రత్యేక స్థానం ఉంది. 80వ దశకంలో తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూత లూగించారు.. బప్పీలహరి అంటే ముందుగా ఆయన ఒంటి నిండా ధరించే బంగారు నగలు గురించే అందరు చర్చించుకుంటారు..ఇంతకీ ఈయన  ఎందుకు తన ఒంటి నిండా అంత బంగారాన్ని ధరిస్తారనేది చాలా మందికి మిలియన్ డాలర్ల ప్రశ్నలా ప్రేక్షకుల మస్తిష్కంలో ఇప్పటికీ ఓ సందేహంలా  ఉంది. అంతేకాదు.. మెడలో నగలు.. చేతి వేళ్లన్నింటికీ ఉంగరాలతో తన కంటూ ప్రత్యేక  ఆహార్యంతో బాలీవుడ్ సంగీత దర్శకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బప్పీలహరి..

    ముఖ్యంగా బప్పీలహరి తన సంగీతంతో పాటు తనదైన ఆహార్యంతో ఎక్కువగా ప్రజల్లో పాపులర్ అయ్యారు..బప్పీలహరి ఒంటి నిండా నగలు ధరించే విషయమై ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. ఓ హాలీవుడ్ నటుడిని చూసి ప్రేరణ చెంది ఒంటి నిండా నగలు ధరించడం మొదలు పెట్టానని చెప్పారు.ఎల్వీఎస్ ప్రెస్లీ అనే హాలీవుడ్ నటుడు ఎపుడు మెడలో ఓ గోల్డ్ చెయిన్ వేసుకునే వారు.. ఆయన ఆహార్యంతో ఇంప్రెస్ అయి.. అప్పటి నుంచి తను కూడా ఒంటి నిండా నగలు వేసుకోవడం మొదలు పెట్టినట్టు చెప్పారు.

    ఒంటి నిండా బంగారంతో గోల్డ్ మ్యాన్ ఆఫ్ భారత్ ‘బప్పీలహరి’ (Twitter/Photo)


    ఒంటి నిండా నగులు వేసుకున్నప్పటి నుంచి తనకు విజయాలు వరించడం మొదలయ్యాయన్నారు. అప్పటి నుంచి నగలు ధరించడం సెంటిమెంట్‌గా మారిందన్నారు. గోల్డ్ ఈజ్ మై గాడ్.. అని పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. ఓ సారి ’జక్మీ’ పాటల రికార్డిండ్ సమయంలో దేవుడి పేరుతో ఉన్న లాకెట్ ఉన్న బంగారు గొలుసును మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. అపుడు ఆ ఆల్బమ్ సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత మరో సందర్భంగా అమ్మ మరో గోల్డ్ చెయిన్ ఇవ్వగా.. వెంటనే తనకు పెళ్లైందన్నారు. అప్పటి నుంచి బంగారాన్ని తన అదృష్టంగా భావిస్తూ వచ్చాను. ఇలా బంగారం కొనడం నాకు జీవితంలో ఓ భాగమైంది. ముఖ్యంగా .. బప్పీలహరి .. దీపావళి ముందు వచ్చే ధన త్రయోదశి రోజున ఓ బంగారు ఆభరణం కొనడం తనకు సెంటిమెంట్‌గా మారిందన్నారు. ఈయన గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు.

    Chiranjeevi - Balakrishna - Jr NTR - Ram Charan : చిరంజీవి టూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ టూ రామ్ చరణ్ అందరి చూపు దాని వైపే..


    2014లో ఈయన భారతీయ జనతా పార్టీ తరుపున బెంగాల్‌లో లోక్‌సభకు పోటీ చేసారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందు పరిచారు. అందులో తన వద్ద 754 గ్రాముల బంగారం, 4.62 కిలోల వెండి.. భార్య వద్ద 967 గ్రాముల గోల్డ్.. 8.9 కేజీల సిల్వర్ ఉందని వెల్లడించారు. 1996లో ఓ  సందర్భంలో  మైకేల్ జాక్సన్ మన దేశాని వచ్చారు. అపుడు ఓ సంగీత కార్యక్రమంలో మైఖేల్ జాక్సన్.. బప్పీలహరిని కలవడం జరిగింది. అపుడు జాక్సన్..  ఈయన వేసుకున్న నగలు చూసి ఆయన పేరు అడిగారు.

    Chiranjeevi - Pawan Kalyan - Ram Charan : చరిత్ర తిరగ రాస్తున్న మెగా హీరోలు.. చిరంజీవి రూట్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్..


    తన పేరు బప్పీలహరి అని చెప్పగానే.. మీరు మ్యూజిక్ డైరెక్టర్ కదా..  మీరు మ్యూజిక్  కంపోజ్ .. చేసిన డిస్క్ డాన్సర్ సినిమాలోని జిమ్మీ జిమ్మీ పాట తన ఎంతగానే ఇష్టమనడం తనకు ఇప్పటికీ మరిచిపోలేనన్నారు.  ఇక ఈయన 1980 దశకంలో 3 యేళ్లలో 180కు పైగా పాటలను కంపోజ్ చేసినందకు కాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఎక్కారు. ఈయనకు తెలుగులు సినిమాలతో మంచి అనుబంధం ఉంది. ఈ బుధవారం కన్నుమూసిన బప్పీలహరి అంత్యక్రియలు మరి కాపేట్లో ముంబైలో జరగనున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bappi lahiri, Bollywood news, Tollywood

    తదుపరి వార్తలు