Home /News /movies /

BANGARRAJU WORLD WIDE COLLECTIONS NAGARJUNA AKKINENI NAGA CHAITANYA RAMYA KRISHNA KRITHI SHETTY BANGARRAJU MOVIE 13 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Bangarraju 13 Days WW Collections : నాగార్జున ‘బంగార్రాజు’ 13 రోజుల కలెక్షన్స్.. లాభాల్లోకి రావాలంటే ఇంకా ఎంత రాబట్టాలంటే..

బంగార్రాజు మూవీ 13 డేస్ కలెక్షన్స్ (Bangarraju Photo :Twitter)

బంగార్రాజు మూవీ 13 డేస్ కలెక్షన్స్ (Bangarraju Photo :Twitter)

Bangarraju 13 Days World Wide Collections : అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా 13వ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    Bangarraju 9 Days Collections :  అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). ఈ  సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం  మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతూనే ఉన్నాడు.పైగా చాలా యేళ్ల తర్వాత  ఒకే స్క్రీన్ పై నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.

    మొదటి నాలుగు రోజులు జోరు చూపించిన ఈ సినిమా ఐదో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.  తాజాగా 10వ రోజు సండే రోజు మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీక్ డేస్‌లో మంచి గ్రోత్‌తో నడుస్తోంది. తాజాగా ఈ సినిమా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 51 లక్షల షేర్ రాబట్టింది.  ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు.

    Nagarjuna - Akhil : నాగార్జున, అఖిల్.. ఒకే తరహా సినిమాలు చేస్తోన్న అక్కినేని తండ్రీ తనయులు..


    నైజాం(తెలంగాణ) : రూ. 8.10 కోట్లు / రూ. 11 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 6.53 కోట్లు / రూ. 6 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 4.96 కోట్లు / రూ. 4.05 కోట్లు
    ఈస్ట్:రూ 3.97 కోట్లు / రూ. 2.8 కోట్లు
    వెస్ట్: రూ. 2. 79 కోట్లు / రూ. 2.6 కోట్లు
    గుంటూరు:రూ. 3.32 కోట్లు / రూ. 3.20 కోట్లు
    కృష్ణా: 2.16 కోట్లు / రూ. 2.70 కోట్లు
    నెల్లూరు: రూ.1.69 కోట్లు / 1.45 కోట్లు


    తెలంగాణ + ఏపీ : రూ. 33.52కోట్లు షేర్ ( 54.30 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 33.80 కోట్లు..
    రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.1.73 కోట్లు / రూ. 2.15 కోట్లు..

    ఓవర్సీస్ : రూ. 1.45 కోట్లు..  / రూ. 2.20 కోట్లు..                                                                                  టోటల్ వరల్డ్ వైడ్ 13 రోజుల కలెక్షన్స్ : రూ.36.70 కోట్లు షేర్ (రూ. 61.55 కోట్ల గ్రాస్ వసూళ్లు)  / రూ.  38.15 కోట్లు వసూళ్లు..

    మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా రూ 2 కోట్ల వరకు షేర్ రాబడితే సేఫ్ అవుతోంది. ఈ సినిమా ఏపీలో తక్కువ రేట్స్‌కు అమ్మడంతో లాభాల్లోకి వచ్చింది. 100 శాతం ఆక్యుపెన్షీ ఉన్న  నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు దూరంగా ఉంది. ఇక ఏపీలో కృష్ణాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలో ‘బంగార్రాజు’కు ఆశించినంత రెస్పాన్స్ దక్కలేదనే చెప్పాలి.  మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్‌‌లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.

    Balakrishna - Akhanda : బాలకృష్ణ ’అఖండ’ ప్రభంజనం.. ఆ నాలుగు భాషల్లో డబ్ కానున్న మూవీ..


    బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టించారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bangarraju, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Tollywood

    తదుపరి వార్తలు