Nagarjuna | Bangarraju : నాగార్జున, నాగ చైతన్యలు కలిసి ‘బంగార్రాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య నటిస్తున్నారు.
Nagarjuna | Bangarraju : నాగార్జున, నాగ చైతన్యలు కలిసి ‘బంగార్రాజు’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. బంగార్రాజు జనవరి 15న విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో భాగంగా బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అంటూ ఓ ప్రోగ్రామ్ చేసింది. కార్యక్రమం జీ తెలుగులో సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఉదయం 9 గంటలకు ప్రసారం కానుంది. కేరళలో నిర్వహించిన కార్యక్రమంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య పాల్గోన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగార్రాజు.. దాదాపు 5 ఏళ్ళకి ముందు వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఇక ముందు నుంచి సంక్రాంతి రేసులో ఉంటామని ప్రకటించిన ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి రేసులో అన్ని సినిమాలే వస్తున్నాయి. బంగార్రాజు సినిమాకు సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా రెండు గంటల నలబై నిమిషాల నిడివితో రానుంది.
ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు ఊహించని బిజినెస్ జరిగిందని అంటున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా దాదాపు 5 ఏళ్ళకి వస్తున్న ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే బిజినెస్ జరుగుతోందని అంటున్నారు. ఈ సినిమా ముందు తెలుగు రాష్ట్రాలలో 22 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్లో బిజినెస్ అయ్యిండేది అనుకున్నా.. ప్రస్తుతం ఎలాంటీ సినిమాలు లేకపోవడంతో అన్ని ఏరియాలలో ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పుడు 30 నుంచి 35 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని టాక్. దీంతో నాగార్జున కెరీర్లో ఇది హైయెస్ట్ బిజినెస్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా వసూళ్లను రాబట్టనుందో..
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మరో సాంగ్ లిరికల్ విడుదలైంది. వాసివాడి తస్సాదియ్యా అంటూ సాగే ఈ పాట మాస్కు ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. నిన్న టీజర్‌ను విడుదల చేయగా.. పూర్తి పాటను డిసెంబర్ 19న విడుదల చేశారు. ఈ పాటను కళ్యాణ కృష్ణ కురసాల రాయగా.. మోహన బోగరాజు, సాహితి పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో ఆట పాటలే కాకుండా కేరళ మొత్తం అనుభూతి చెందేలాగా మీ ముందుకు రాబోతున్నాం
ఇక ఆ మధ్య ‘నా కోసం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట మెలోడియస్గా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ పాటను బాలాజీ రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇక నాగ చైతన్య నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన బంగార్రాజుతో పాటు ‘థాంక్యూ’ మూవీలో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హార్రర్ జానర్లో వస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.