హోమ్ /వార్తలు /సినిమా /

Bangarraju : నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ మూవీ నుంచి పార్టీ సాంగ్‌కు ముహూర్తం ఖరారు..

Bangarraju : నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ మూవీ నుంచి పార్టీ సాంగ్‌కు ముహూర్తం ఖరారు..

Nagarjuna Akkineni Naga Chaitanya Bangarraju Photo : Twitter

Nagarjuna Akkineni Naga Chaitanya Bangarraju Photo : Twitter

Nagarjuna - Naga Chaitanya - Bangarraju : నాగార్జున, నాగ చైతన్యల కలిసి నటిస్తోన్న మూవీ ‘బంగార్రాజు’. ఇప్పటికే నాగార్జున, నాగ చైతన్యల బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో పార్టీ సాంగ్ టీజర్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

ఇంకా చదవండి ...

  Nagarjuna - Naga Chaitanya - Bangarraju : నాగార్జున, నాగ చైతన్యల కలిసి నటిస్తోన్న మూవీ ‘బంగార్రాజు’. ఈ యేడాది నాగార్జున ‘వైల్డ్‌డాగ్’ మూవీకి మంచి టాక్ వచ్చినా.. అందుకు తగ్గ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేదు. నాగార్జునకు కలిసి రాని 2021.. నాగ చైతన్య, అఖిల్‌లకు కలిసొచ్చింది.  ఈ యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో చైతూ మంచి సక్సెస్ అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున లెవల్లో నటించి ఔరా అనిపించారు. తండ్రి నాగార్జునతో నాగ చైతన్యకు ఇది మూడో సినిమా. మొదటి సారి వీళ్లిద్దరు కలిసి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘మనం’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత నాగ చైతన్య తన తండ్రితో కలిసి ‘ప్రేమమ్’లో నటించారు. ఈ సినిమాలో చైతూ ఫాదర్ పాత్రలో నాగార్జున అదరగొట్టారు.

  తాజాగా నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జునతో కలిసి మూడో సారి కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.

  మహేష్ బాబు, నమ్రత బాటలో గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న ఈ సినీ జంటలు తెలుసా..

  తాజాగా ఈ సినిమాలో పార్టీ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ నెల 17న  ఈ పాట టీజర్‌ను విడుదల చేయనున్నట్టు బంగార్రాజు టీమ్ ప్రకటించింది. బంగార్రాజు విషయానికొస్తే..  ఒకే సినిమాలో తండ్రీ కొడుకులు టైటిల్ రోల్ పోషించడం విశేషం. గతంలో మోహన్ బాబు హీరోగా నటించిన ‘గాయత్రి’లో యంగ్ ఏజ్ పాత్రలో మంచు విష్ణు నటించారు. ఇపుడు అదే తరహాలో నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్నారు.

  మరోవైపు నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘థాంక్యూ’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. . ఈ లుక్‌లో నిచ్చెన పై కూర్చొని  కళ్ల జోడుతో హాయిగా నవ్వుతున్న నాగ చైతన్య లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.  మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.

  Akhanda : అఖండ దూకుడు ముందు ఐదేళ్ల ఆ రికార్డ్ ఫసక్.. బాలకృష్ణ మాస్ బీభత్సం..

  ఏమైనా నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ వంటి క్లాస్ లవ్ స్టోరీ తర్వాత.. ‘బంగార్రాజుగా మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులన పలకరించబోతున్నారు. ఆ తర్వాత ‘లాల్ సింగ్ చద్ధా’లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో మేనమావ వెంకటేష్‌తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ‘వెంకీ మామ’ సినిమాలో ఆర్మీ సైనికుడి పాత్రలో నటించిన సంగతి  తెలిసిందే కదా. కానీ ఆమీర్ ఖాన్‌తో చేస్తోన్న ‘లాల్ సింగ్ చద్ధా’లో మాత్రం పూర్తి స్థాయిలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మొత్తంగా నాగ చైతన్య డిఫరెంట్ సినిమాలతో మంచి దూకుడు మీదున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bangarraju, Faria Abdullah, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Tollywood

  ఉత్తమ కథలు