Home /News /movies /

BANGARRAJU NAGARJUNA AKKINENI BIGG BOSS BEAUTY MONAL GAJJAR AND MEENAKSHI CHAUDHARY TA

Bangarraju - Nagarjuna : నాగార్జున ‘బంగార్రాజు’లో బిగ్‌బాస్ బ్యూటీతో పాటు మరో క్రేజీ హీరోయిన్‌...

నాగ చైతన్య, నాగార్జున (Twitter/Photo)

నాగ చైతన్య, నాగార్జున (Twitter/Photo)

Bangarraju - Nagarjuna : నాగార్జున ముఖ్యపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ మూవీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ,కృతి శెట్టితో పాటు మరో ఇద్దరు బ్యూటీలో నటించబోతున్నట్టు సమాచారం.

    Bangarraju - Nagarjuna : అక్కినేని నాగార్జున బంగార్రాజు’లో బిగ్‌బాస్ బ్యూటీతో పాటు మరో క్రేజీ భామ నటించబోతున్నట్టు సమాచారం. నాగార్జున ఈ యేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అనుకున్నంత రేంజ్‌లో వసూళ్లను సాధించలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మూవీ ‘బంగార్రాజు’(Bangarraju) సినిమా పట్టాలెక్కింది.  ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి చాలా రోజులే అవుతోంది. ఈ సినిమాలో మరో హీరోగా నాగార్జున తనయుడు నాగ చైతన్య (Naga Chaitanya) కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. నాగార్జున సరసన మరోసారి రమ్యకృష్ణ నటిస్తోంది.

    ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కాకుండా.. మరో ఇద్దరు హీరోయిన్స్‌ నటిస్తున్నట్టు సమాచారం. అందులో ఖిలాడీ భామ మీనాక్షి చౌదరి మరో ముఖ్యపాత్రలో నటిస్తోన్నట్టు సమాచారం. దాంతో పాటు బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గుజ్జర్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. సోగ్గాడే చిన్నినాయనా’లో అనసూయ,హంసా నందిని పాత్రల మాదిరిగానే..  ఇపుడు బంగార్రాజులో వీళ్ల పాత్ర ఉంటుందని చెబుతున్నారు.

    Prema Nagar@50Years : అక్కినేని, వాణిశ్రీల ‘ప్రేమనగర్’కు 50 యేళ్లు పూర్తి.. తెర వెనక కథ..


    నాగార్జునకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందని ద్రాక్షనే అయింది. అందుకే తనకు 5 ఏళ్ల క్రితం సూపర్ హిట్ ఇచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) సినిమాకు ప్రీక్వెల్  చేస్తున్నారు నాగార్జున. గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.

    Love Story Movie Review : నాగ చైతన్య, సాయి పల్లవిల ’లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ.. ఎమోషనల్ లవ్ డ్రామా..


    ఇప్పటికే ఈ సినిమ ా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. ఇప్పటికే  నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మనం తర్వాత వీళ్లిద్దరు కలిసి ఈ సినిమా నటిస్తుండంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.

    Tollywood Industry Hits: టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మూవీస్.. బాహుబలి సహా ఎక్కువ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..


    ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో ‘రాధే శ్యామ్’, పవన్, రానా మూవీతో పాటు, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ సినిమాలున్నాయి. ఇపుడు నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ కూడా విడుదలకు ఉరకలు వేస్తున్నట్టు తెలుస్తోంది.

    NBK - Dual Role: అఖండ సహా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసారో తెలుసా..


    నాగ చైతన్య విషయానికొస్తే.. తాజాగా ‘లవ్ స్టోరీ’ సినిమాతో పలకరించారు. దాంతో పాటు ’థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు. త్వరలో  ఈ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bangarraju, Krithi shetty, Meenakshi Chaudhary, Monal gajjar, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Ramya Krishna, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు