Home /News /movies /

BANGARRAJU NAGARJUNA AKKENENI NAGA CHAITANYA KRITHI SHETTY LAST DAY OF THE SHOOT TA

Bangarraju : ‘బంగార్రాజు’కు గుమ్మడికాయ కొట్టనున్న నాగార్జున, నాగ చైతన్య.. సంక్రాంతి రేసులో సోగ్గాళ్లు..

‘బంగార్రాజు’ షూటింగ్‌కు నేటితో లాస్ట్ (Twitter/Photo)

‘బంగార్రాజు’ షూటింగ్‌కు నేటితో లాస్ట్ (Twitter/Photo)

Nagarjuna - Naga Chaitanya - Bangarraju : నాగ చైతన్య, నాగార్జునలు కలిసి   ‘బంగార్రాజు’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కానున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేసింది.

ఇంకా చదవండి ...
    Nagarjuna - Naga Chaitanya - Bangarraju : నాగ చైతన్య, నాగార్జునలు కలిసి   ‘బంగార్రాజు’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున (Nagarjuna) లెవల్లో నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై ఇంత వరకు క్లారిటీ లేదు. సంక్రాంతి విడుదల అని అంటున్నారు కానీ ప్రమోషన్స్‌‌లో వెనుకబడి ఉంది. దీంతో అసలు బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా.. లేదా అనే క్లారిటీ లేక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫూజన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా నేటితో లాస్ట్ డే షూటింగ్ జరగనుంది. దీంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు.

    ఈ సినిమాను ఎప్పటికపుడు ఏ రోజు షూటింగ్ ఆ రోజు షూటింగ్ పూర్తి చేయడంతో పాటు ఎడిటింగ్ వర్క్ పూర్తి చేస్తున్నట్టు సమాచారం. దీంతో నేటి ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టిన తర్వాత ప్రమోషన్స్ ‌ను స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాను జనవరి 15న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మంచి మాస్ సాంగ్‌తో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది.


    ఇక సంక్రాంతికి వస్తామని ప్రకటించిన పలు సినిమాలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం పోస్ట్ పోన్ కాగా, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫిబ్రవరికి వాయిదా పడింది.

    BalaKrishna : ఫ్యాన్స్‌ను భయపెడుతున్న బాలయ్య నిర్ణయం.. మరోసారి ఫామ్‌లోని దర్శకుడికి ఓకే చెప్పిన నట సింహా ..?

    రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జనవరి 7 వ తేదీన విడుదల కానుండగా.. ప్రభాస్ రాధే శ్యామ్ 14 వ తేదీన విడుదల కానుంది. ఇక ఇదే రేసులో ఉన్న అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బంగార్రాజు చిత్రం విడుదల జనవరి 15 వ తేదీన విడుదల చేయాలనే కసి మీదున్నారు నాగార్జున.  వాసివాడి తస్సాదియ్యా అంటూ సాగే ఈ పాట మాస్‌కు ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. నిన్న టీజర్‌ను విడుదల చేయగా.. పూర్తి పాటను డిసెంబర్ 19న విడుదల చేశారు. ఈ పాటను కళ్యాణ కృష్ణ కురసాల రాయగా... మోహన బోగరాజు, సాహితి పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

    83 Biopic : ముంబైలో ఘనంగా రణ్‌వీర్ సింగ్ ’83’ బయోపిక్ ప్రీమియర్స్.. హాజరైన రియల్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్..


    తండ్రి నాగార్జునతో నాగ చైతన్యకు ‘బంగార్రాజు’ మూడో సినిమా. మొదటి సారి వీళ్లిద్దరు కలిసి  అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘మనం’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత నాగ చైతన్య తన తండ్రితో కలిసి ‘ప్రేమమ్’లో నటించారు. ఈ సినిమాలో చైతూ ఫాదర్ పాత్రలో నాగార్జున అదరగొట్టారు.తాజాగా నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జునతో కలిసి మూడో సారి కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bangarraju, Krithi shetty, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు