Bangarraju 9 Days World Wide Collections : అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ 'బంగార్రాజు' చిత్రం సంక్రాంతి పండక్కి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా వారం పూర్తి చేసుకొంది. ఇక 9 రోజు శనివారం వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్‌లో కాస్తంత గ్రోత్ కనిపించింది.
Bangarraju 9 Days Collections : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). ఈ సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఒకే స్క్రీన్ పై నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది. మొదటి నాలుగు రోజులు జోరు చూపించిన ఈ సినిమా ఐదో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తాజాగా 9వ రోజు మాత్రం గత రోజుతో పోలిస్తే ఏదో పర్వాలేదనపించే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి.
ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు. చాలా కాలం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు. పైగా మంచి టాక్.. పైగా పోటీలో పెద్ద సినిమాలేని లేకపోవడం బాగానే కలిసొచ్చింది. ఈ సినిమా తెలంగాణ, ఏపీలో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొదటి నాలుగు రోజులు కుమ్మేసింది. ఐదు రోజు నుంచి కలెక్షన్స్‌లో డ్రాప్ కనపడింది. 9వ రోజు తెలంగాణ, ఏపీలో రూ. 64 లక్షల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 69 లక్షలు మాత్రమే వసూలు చేసింది బంగార్రాజు.
తెలంగాణ + ఏపీ : రూ. 31.58కోట్లు షేర్ ( 51.02 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 33.80 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.1.65 కోట్లు / రూ. 2.15 కోట్లు..
ఓవర్సీస్ : రూ. 1.40 కోట్లు.. / రూ. 2.20 కోట్లు.. టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ : రూ.34.63 కోట్లు షేర్ (రూ. 55.10 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 38.15 కోట్లు వసూళ్లు..
మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా రూ. 4.37 కోట్ల వరకు షేర్ రాబడితే సేఫ్ అవుతోంది. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, నెల్లూరులో ఈ సినిమా సేఫ్ జోన్లోకి వచ్చేసింది. తెలంగాణలో మరో రూ. 3 కోట్ల దూరంలో ఉంది ఈమూవీ. మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.
బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.