BANGARRAJU COLLECTIONS NAGARJUNA AKKINENI NAGA CHAITANYA RAMYA KRISHNA KRITHI SHETTY BANGARRAJU MOVIE 15 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA
Bangarraju 15 Days WW Collections : ‘బంగార్రాజు’ 15 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్.. అక్కడ మాత్రం నష్టాలు తప్పేలా లేవు..
బంగార్రాజు 15 రోజుల కలెక్షన్స్ (Bangarraju collections)
Bangarraju 15 Days WW Collections : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం ఈ శుక్రవారంతో 15 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం పక్షం రోజుల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..
Bangarraju 15 Days World Wide Collections : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'బంగార్రాజు' (Bangarraju). సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకు బజ్ తోడవడంతో పాటు ఇక సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో ‘బంగార్రాజు’ చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఇక 6 యేళ్ల క్రితం విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతూనే ఉన్నాడు.పైగా చాలా యేళ్ల తర్వాత ఒకే స్క్రీన్ పై తండ్రి తనయులైన నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాకు బాగానే కలిసొచ్చింది.
మొదటి నాలుగు రోజులు జోరు చూపించిన ఈ సినిమా ఐదో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 10వ రోజు తప్పించి ఎక్కడ ‘బంగర్రాజు’ కలెక్షన్లు పుంజుకోలేదు. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 15వ వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ‘బంగార్రాజు’ మూవీ రూ. 14 లక్షల షేర్ రాబట్టింది. ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియాలో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో కలెక్షన్లు లేవు. ఇక అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు.
ఈ సినిమా ఏపీలో మాత్రం మంచి వసూళ్లను రాబడుతూ అక్కడ సేఫ్ జోన్లోకి వచ్చేసింది. ప తెలంగాణలో మాత్రం అంత రివర్స్‌గా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను ఇక్కడ చూసే వాళ్లు కరువైయారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా తెలంగాణలో పెద్దగా వసూళ్లును రాబట్టలేకపోయింది. ఈ తెలంగాణలో బంగార్రాజు థియేటర్ రన్ దాదాపు ముగిసినట్లేనని అంటున్నారు ట్రేడ్ పండితులు.
తెలంగాణ + ఏపీ : రూ. 33.92కోట్లు షేర్ ( 54.80 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 33.80 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: రూ.1.74 కోట్లు / రూ. 2.15 కోట్లు..
ఓవర్సీస్ : రూ. 1.46 కోట్లు.. / రూ. 2.20 కోట్లు.. టోటల్ వరల్డ్ వైడ్ 13 రోజుల కలెక్షన్స్ : రూ.37.12 కోట్లు షేర్ (రూ. 61.55 కోట్ల గ్రాస్ వసూళ్లు) / రూ. 38.15 కోట్లు వసూళ్లు..
మొత్తంగా ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 38.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 39 కోట్ల షేర్ రాబట్టాలి. ఇంకా రూ. 1.88 కోట్ల వరకు షేర్ రాబడితే సేఫ్ అవుతోంది. ఈ సినిమా ఏపీలో తక్కువ రేట్స్‌కు అమ్మడంతో లాభాల్లోకి వచ్చింది. 100 శాతం ఆక్యుపెన్షీ ఉన్న నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్‌కు దూరంగా ఉంది. ఇక ఏపీలో కృష్ణాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలో ‘బంగార్రాజు’కు ఆశించినంత రెస్పాన్స్ దక్కలేదనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా టోటల్ రన్లో ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.
బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మించాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.