Home /News /movies /

BANGARRAJU 2 DAYS WW COLLECTIONS AND NAGARJUNA NAGA CHAITANYA MOVIE GOING GREAT AT BOX OFFICE PK

Bangarraju 2 days WW collections: ‘బంగార్రాజు’ 2 డేస్ కలెక్షన్స్.. ఊచకోత కోస్తున్న అక్కినేని సోగ్గాళ్లు..

బంగార్రాజు మూవీ 2 డేస్ కలెక్షన్స్ (Bangarraju Photo :Twitter)

బంగార్రాజు మూవీ 2 డేస్ కలెక్షన్స్ (Bangarraju Photo :Twitter)

Bangarraju 2 days WW collections: అక్కినేని హీరోలు నెవర్ బిఫోర్.. అన్నట్లు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నారు. నాగ చైతన్య, నాగార్జున (Nagarjuna Naga Chaitanya) హీరోలుగా నటించిన బంగార్రాజు (Bangarraju 2 days WW collections) సంక్రాంతి సందడిని మొత్తం చూపించేస్తుంది. ఏ నమ్మకంతో అయితే నాగార్జున ఈ సినిమాను విడుదల చేసాడో.. అది లెక్కల రూపంలో కనిపిస్తుంది.

ఇంకా చదవండి ...
అక్కినేని హీరోలు నెవర్ బిఫోర్.. అన్నట్లు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నారు. నాగ చైతన్య, నాగార్జున హీరోలుగా నటించిన బంగార్రాజు సంక్రాంతి సందడిని మొత్తం చూపించేస్తుంది. ఏ నమ్మకంతో అయితే నాగార్జున ఈ సినిమాను విడుదల చేసాడో.. అది లెక్కల రూపంలో కనిపిస్తుంది. మొదటి రోజు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది. కోవిడ్ నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు కుమ్మేస్తున్నాడు. మీడియం రేంజ్ సినిమాలలో ఆల్‌టైమ్ రికార్డు వసూళ్లకు తెర తీస్తున్నాడు. రెండో రోజు కూడా ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 7.79 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 9.79 కోట్లు వసూలు చేసింది. మరి రెండు రోజుల్లో బంగార్రాజు తీసుకొచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం..

నైజాం: 4.47 కోట్లు
సీడెడ్: 3.46 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.20 కోట్లు
ఈస్ట్: 1.75 కోట్లు
వెస్ట్: 1.38 కోట్లు
గుంటూరు: 1.78 కోట్లు
కృష్ణా: 0.96 కోట్లు
నెల్లూరు: 0.85 కోట్లు

Naga Chaitanya - Samantha: ఆ విషయంలో ఎప్పటికీ సమంత ది బెస్ట్ అంటున్న నాగ చైతన్య..


ఏపీ-తెలంగాణ టోటల్: 16.85 కోట్లు
ఓవర్సీస్: 0.95 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 1.05 కోట్లు
వరల్డ్ వైడ్ 2 డేస్ కలెక్షన్స్: 18.85 కోట్లు షేర్

Acharya release date: ‘ఆచార్య’ విడుదల తేదీ ఖరారు.. మహేష్ బాబు డేట్ తీసుకున్న చిరంజీవి..


సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా ఇది. దీనికి ముందు 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే పండక్కి మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. నాగార్జున కెరీర్‌లోనే అత్యధికంగా 38 కోట్లకు పైగానే ఈ సినిమాను బిజినెస్ చేసారు. 40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. మొదటి 2 రోజుల్లోనే 19 కోట్లు షేర్ వసూలు చేసింది. మరో 20 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ అవుతుంది. మూడో రోజు ఆదివారం కూడా కచ్చితంగా 10 కోట్ల వరకు షేర్ వచ్చేలా కనిపిస్తుంది. ఎలాగూ రాబోయే రోజుల్లో కూడా సెలవులే ఉండటంతో కచ్చితంగా బంగార్రాజు దూకుడు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akkineni nagarjuna, Box Office Collections, Naga Chaitanya, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు