Bangarraju 1st weekend WW collections: సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా ఇది. దీనికి ముందు 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే పండక్కి మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. నాగార్జున (Bangarraju 1st weekend WW collections) కెరీర్లోనే అత్యధికంగా 38 కోట్లకు పైగానే ఈ సినిమాను బిజినెస్ చేసారు.
బంగార్రాజు మూడో రోజు కూడా అదరగొట్టాడు. ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అక్కినేని హీరోలు నెవర్ బిఫోర్.. అన్నట్లు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నారు. నాగ చైతన్య, నాగార్జున హీరోలుగా నటించిన బంగార్రాజు సంక్రాంతి సందడిని మొత్తం చూపించేస్తుంది. ఏ నమ్మకంతో అయితే నాగార్జున ఈ సినిమాను విడుదల చేసాడో.. అది లెక్కల రూపంలో కనిపిస్తుంది. మొదటి రోజు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. రెండు, మూడో రోజు కూడా అదే దూకుడు చూపించింది. కోవిడ్ నిబంధనలు ఉన్నా.. ఏపీలో నైట్ కర్ప్యూ అమలులో ఉన్నా.. టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా.. అన్నింటికీ అధిగమించి బంగార్రాజు కుమ్మేస్తున్నాడు. మీడియం రేంజ్ సినిమాలలో ఆల్టైమ్ రికార్డు వసూళ్లకు తెర తీస్తున్నాడు. మూడో రోజు కూడా ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 6.82 కోట్లు షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 7.72 కోట్లు వసూలు చేసింది. మరి ఫస్ట్ వీకెండ్ బంగార్రాజు తీసుకొచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం..
సంక్రాంతికి విడుదలైన ఒకే ఒక్క పెద్ద సినిమా ఇది. దీనికి ముందు 34 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే పండక్కి మరే సినిమాలు లేకపోవడంతో మరో 5 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. నాగార్జున కెరీర్లోనే అత్యధికంగా 38 కోట్లకు పైగానే ఈ సినిమాను బిజినెస్ చేసారు. 40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. మొదటి 3 రోజుల్లోనే 26.85 కోట్లు షేర్ వసూలు చేసింది. మరో 12 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ అవుతుంది. ఎలాగూ సెలవులు ఉండటంతో కచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా బంగార్రాజు దూకుడు సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.