Bandobast Teaser Talk: మోహన్‌లాల్,సూర్య ‘బందోబస్త్’ టీజర్ టాక్..

ఈ యేడాది ‘NGK’ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సూర్య...ఇపుడు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో బందోబస్త్ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: July 6, 2019, 7:51 PM IST
Bandobast Teaser Talk: మోహన్‌లాల్,సూర్య ‘బందోబస్త్’ టీజర్ టాక్..
మోహన్‌లాల్,సూర్య,‘బందోబస్త్’
  • Share this:
ఈ యేడాది ‘NGK’ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సూర్య...ఇపుడు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. మోహన్ లాల్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘బందోబస్త్’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్‌ టీజర్‌ను రిలీజ్ చేసారు.

ఈ సినిమాను దేశ భద్రత, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కించనట్టు కనబడుతోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్.. ప్రధాన మంత్రి పాత్రలో నటించారు. సూర్య NSG కమెండో పాత్రలో నటించాడు. ఇతర ముఖ్యపాత్రల్లో ఆర్య, బొమన్ ఇరానీ, సాయేషా సైగల్ నటించారు. హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఈ సినిమాను ‘రంగం’ వంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన కే.వి.ఆనంద్ డైరెక్ట్ చేసాడు. గతంలో సూర్యతో ‘బ్రదర్స్’ తో పాటు ‘వీడొక్కడే’ వంటి సినిమాలను తెరకెక్కించాడు. తాజాగా ఇపుడు ‘బందోబస్త్’ టైటిల్‌తో వస్తున్నాడు. మరి తెలుగులో ఈ సినిమా  ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

 

First published: July 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...