రివ్యూ: బందోబస్త్.. యావరేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్..

సూర్య సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గిరాకీ ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఆయన ఎంచుకుంటున్న కథలే ఆ క్రేజ్ పోగొట్టాయి. ఈ ఏడాది ఎన్జీకే సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉనికి చాటుకోడానికి సూర్య చేసిన సినిమా బందోబస్త్. మరి ఇది ఎంతవరకు మన ఆడియన్స్‌ను మెప్పించిందో చూద్దాం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 20, 2019, 4:45 PM IST
రివ్యూ: బందోబస్త్.. యావరేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్..
మోహన్‌లాల్,సూర్య,‘బందోబస్త్’
  • Share this:
నటీనటులు: సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖని తదితరులు
సంగీతం: హరీష్ జైరాజ్

నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కేవీ ఆనంద్

సూర్య సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గిరాకీ ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఆయన ఎంచుకుంటున్న కథలే ఆ క్రేజ్ పోగొట్టాయి. ఈ ఏడాది ఎన్జీకే సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉనికి చాటుకోడానికి సూర్య చేసిన సినిమా బందోబస్త్. మరి ఇది ఎంతవరకు మన ఆడియన్స్‌ను మెప్పించిందో చూద్దాం..

కథ:
భారతదేశ ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) ఎప్పుడూ జనం మేలు కోరే నాయకుడు. ఆయన్ని చంపాలని పాకిస్తాన్ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. అతడి రక్షణ కోసమే ప్రత్యేకంగా నిజాయితీ గల ఆఫీసర్‌గా రవి కిషోర్ (సూర్య) ఎంపిక అవుతాడు. ఊళ్లో వ్యవసాయం చేస్తూనే మరోవైపు ఇంటిలిజెన్స్‌లో పని చేస్తుంటాడు. మరోవైపు ప్రధాని దేశానికి కీడు చేస్తున్న వాళ్లపై ఉక్కుపాదం మోపుతాడు. ఈ క్రమంలోనే తన ధైర్యంతో ప్రధాని చంద్రకాంత్ వర్మకి దగ్గర అవుతాడు రవికిషోర్. ఆయన పర్సనల్ ఆఫీసర్‌గా ఎంపిక అవుతాడు. ఆ క్రమంలోనే అక్కడే పని చేస్తున్న అంజలి (సయేషా సైగల్)తో ప్రేమలో పడతాడు రవి కిషోర్. అయితే ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనలతో ప్రధాని వర్మ చనిపోతాడు. అప్పుడు తెరపైకి ఆయన తనయుడు వర్మ (ఆర్య) వస్తాడు. అసలు ప్రధానికి చంపింది ఎవరు.. ఆయన మరణంతో ఇండస్ట్రియలిస్ట్ మహవీర్(బోమన్ ఇరాని)కి ఏంటి సంబంధం అనేది అసలు కథ..కథనం:
వీడొక్కడే, రంగం లాంటి సినిమాలు చేసిన దర్శకుడు కేవీ ఆనంద్. ఈయన నుంచి వస్తున్న సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం పెద్దగా భారీ అంచనాలు లేకుండానే బందోబస్త్ విడుదలైంది. తెలుగులో ఇప్పటికే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్స్ చాలానే వచ్చాయి. ఇప్పుడు ఆనంద్ కూడా ఇలాంటి కథే చేసాడు మళ్లీ. కాకపోతే దీనికి టెర్రరిజం కూడా యాడ్ చేసాడు. అక్కడే కథ కాస్త ఆసక్తికరంగా మారింది. కానీ రాసుకున్నంత పకడ్బందీగా స్క్రీన్ పై మాత్రం బందోబస్త్ కనిపించలేదు. ఫస్టాఫ్ అంతా సూర్య వ్యవసాయంతో పాటు ఇంటిలిజెన్స్ విభాగంలో ఉండటం బాగానే అనిపించినా కూడా కన్ఫ్యూజింగ్‌గానూ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు కనీసం లాజిక్‌కు కూడా అందవు. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా కొన్ని సీన్స్ అయితే మరీ అతిగా అనిపిస్తాయి. ప్రధానమంత్రిని అంత తేలిగ్గా చంపడం.. ఆ తర్వాత ఆర్య ప్రధాని కావడం.. అక్కడ్నుంచి వచ్చే సన్నివేశాలు కాస్త సిల్లీగా అనిపిస్తాయి. అయితే ఇండో పాక్ టెర్రరిజం సీన్స్.. యాక్షన్ సన్నివేశాలు బందోబస్త్ సినిమాకు ప్రాణం. ప్రధాన పాత్రలపై వచ్చే సన్నివేశాలు ఆకట్టుకోవు.. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదర్లేదు. సెకెండ్ హాఫ్ అనుకున్న దానికంటే నెమ్మదించడం.. కథ ముందే తెలిసిపోవడం.. స్క్రీన్ ప్లే లోపించడం బందోబస్త్‌ను సగటు సినిమాగా మార్చేసాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిస్ అవ్వడం దీనికి మరో మైనస్. పేలవమైన కథనం, ప్రీ క్లైమాక్స్ మరీ సాగదీయడంతో ఆసక్తి తగ్గిపోతుంది. మొత్తానికి స్క్రీన్ ప్లే పర్లేదనిపించినా.. కథ మాత్రం పూర్తిగా పాతది కావడం దీనికి మైనస్ అయిపోయింది.

నటీనటులు:
సూర్య మరోసారి తన పాత్రకు ప్రాణం పోసాడు. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మోహన్ లాల్ ఇలాంటి చిన్న పాత్రను ఒప్పుకోవడం గొప్ప విషయమే. స్టార్ హీరో అయ్యుండి అతిథి పాత్ర చేసాడు ఈయన. ఆర్య పర్లేదు. సయేషా సైగల్ జస్ట్ ఓకే అనిపించింది. సముద్రఖని తన పాత్రకు ప్రాణం పోసాడు.. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:
హరీష్ జైరాజ్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఒక్కపాట కూడా వినడానికి అర్థం కాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఎడిటర్ సెకండాఫ్‌ను పూర్తిగా వదిలేసాడేమో అనిపించింది. ప్రతీ సీన్ సాగదీసినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా తెలుగు ప్రేక్షకుల కోసం కాస్త కత్తెర పడుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడిగా కేవీ ఆనంద్ పెద్దగా ఆకట్టుకోలేదు ఈ సారి. రంగం, వీడొక్కడే దృష్టిలో ఉన్న వాళ్లకు ఈ సినిమా రుచించడం కష్టమే. స్క్రీన్ ప్లే బాగున్నా.. స్టోరీ గాడితప్పింది.

చివరగా ఒక్కమాట:
బందోబస్త్.. స్క్రీన్ ప్లే బందోబస్త్.. కానీ కథే కాదు..

రేటింగ్: 2.75/5
Published by: Praveen Kumar Vadla
First published: September 20, 2019, 4:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading