‘బందోబస్త్’ ట్రైలర్ టాక్.. సూర్య ఈ సారి కొట్టేలా ఉన్నాడుగా..

ఈ ఏడాది ‘NGK’ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సూర్య...ఇపుడు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. మోహన్ లాల్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 13, 2019, 9:51 PM IST
‘బందోబస్త్’ ట్రైలర్ టాక్.. సూర్య ఈ సారి కొట్టేలా ఉన్నాడుగా..
మోహన్‌లాల్,సూర్య,‘బందోబస్త్’
  • Share this:
ఈ ఏడాది ‘NGK’ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సూర్య...ఇపుడు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. మోహన్ లాల్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘బందోబస్త్’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాను దేశ భద్రత, ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కించనట్టు కనబడుతోంది.


ఈ సినిమాలో మోహన్‌లాల్.. ప్రధాన మంత్రి పాత్రలో నటించారు. సూర్య NSG కమెండో పాత్రలో నటించాడు. ఇతర ముఖ్యపాత్రల్లో ఆర్య, బొమన్ ఇరానీ, సాయేషా సైగల్ నటించారు. హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఈ సినిమాను ‘రంగం’ వంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన కే.వి.ఆనంద్ డైరెక్ట్ చేసాడు. గతంలో సూర్యతో ‘బ్రదర్స్’ తో పాటు ‘వీడొక్కడే’ వంటి సినిమాలను తెరకెక్కించాడు. తాజాగా ఇపుడు ‘బందోబస్త్’ టైటిల్‌తో వస్తున్నాడు. మరి తెలుగులో ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

First published: September 13, 2019, 9:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading