Bandla Ganesh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్.. ఇకపై వాటికి చోటు లేదంటూ?

Bandla Ganesh

Bandla Ganesh: తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. నిర్మాతగా కంటే ముందు సహాయ పాత్రలలో నటించాడు. గబ్బర్ సింగ్, తీన్మార్ వంటి పలు సినిమాలకు నిర్మాతగా చేశాడు.

  • Share this:
    Bandla Ganesh: తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. నిర్మాతగా కంటే ముందు సహాయ పాత్రలలో నటించాడు. గబ్బర్ సింగ్, తీన్మార్ వంటి పలు సినిమాలకు నిర్మాతగా చేశాడు. కేవలం 11 సినిమాలలో మాత్రమే నటించాడు. ఇక వ్యక్తిగత విషయంలో బాగా వివాదాలు ఎదుర్కొంటాడు. సోషల్ మీడియాలో నిత్యం పోస్టులతో బాగా బిజీగా ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా తన లైఫ్ లో అలాంటి వాటికి చోటు లేదంటూ త్వరలోనే వాటికి గుడ్ బై చెబుతాను అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా కంటే ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఎక్కువ పరిచయం పెంచుకున్నాడు. పవన్ గురించి మాట్లాడనిదే తనకు నిద్రపట్టదనే చెప్పాలి. తన ఇంట్లో కూడా పవన్ ఫోటోలను తెగ పెట్టుకున్నాడు. ఇక పవన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో బాగా పంచుకుంటాడు. అలా పవన్ అభిమానుల నుండి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు బండ్ల గణేష్.

    ఇక కొందరు అతనిపై వ్యతిరేకంగా స్పందిస్తారు. ఇక పవన్ కు దేవర అని ఒక పేరు కూడా పెట్టిన సంగతి తెలిసిందే.ఇక వ్యక్తిగతంగా కూడా తన వంతు సహాయంతో ముందుకు వస్తాడు బండ్ల గణేష్. తనను సోషల్ మీడియా వేదికగా ఎవరైనా వెంటనే సాయం అడిగితే కాదనకుండా తన వంతు సహాయం చేస్తాడు.

    ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాను త్వరలోనే తొలగిస్తానని తెలిపాడు. ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేస్తా అంటూ.. నో కాంట్రవర్సీస్.. నా లైఫ్ లో అలాంటి వాటికి చోటు లేదు అంటూ తెలుపగా.. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక బండ్ల గణేష్ అభిమానులు ఈ ట్వీట్ చూసి ఇంత సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: