హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వైరల్ అవుతున్న బండ్ల గణేష్‌ ట్వీట్..

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వైరల్ అవుతున్న బండ్ల గణేష్‌ ట్వీట్..

బండ్ల గణేష్, ఎన్టీఆర్ (File/Photo)

బండ్ల గణేష్, ఎన్టీఆర్ (File/Photo)

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో యంగ్ టైగర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ హంగామా చేస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పుట్టినరోజు సందర్భంగా తనదైన శైలిలో ట్వీట్లు చేసాడు.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో యంగ్ టైగర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ హంగామా చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డబూ రత్నానీ తీసిన ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో పై పలువురు నెటిజన్స్‌తో పాటు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా ఈ పిక్ పై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపంచాడు. ఇదే సమయంలో తారక్ గురించి వరుస ట్వీట్లు చేసాడు. వామ్మో.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ అదిరిపోయింది. బతకాలంటే బాద్‌షా కిందుండాలి. చావాలంటే బాద్‌షా ముందుండాలి. భయపడేవాడు బానిస. భయపెట్టే వాడు బాద్‌షా. అంటూ ఎన్టీఆర్‌తో తాను నిర్మించిన బాద్‌షా సినిమాలోని డైలాగులను ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. అంతేకాదు.. బాద్షా డిసైడ్ అయితే.. వార్ వన్ సైడ్ అయిపోద్ది. అయ్య డిసైడ్ అయ్యాడు. అందుకే వార్ వన్ సైడ్ చేశాడు. చచ్చిన జంతువును సింహం ముట్టదు. భయపడే మనిసిని బాద్‌షా చంపడు. అంటూ ఎన్టీఆర్ పై తనదైన భక్తిని ప్రదర్శించాడు. బండ్ల గణేష్ ఎన్టీఆర్‌తో బాద్‌షాతో పాటు టెంపర్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలనే అందుకున్న సంగతి తెలిసిందే కదా.
First published:

Tags: Bandla Ganesh, Jr ntr, Tollywood

ఉత్తమ కథలు