మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ఈ నెల 11 న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిన్న ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. అది అలా ఉంటే ఈ సినిమాలో బండ్ల గణేష్ చాలా రోజుల తర్వాత ఓ పాత్ర చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఈ వేడుకకు హాజరై మాట్లాడుతూ.. తనని ఎవరూ బ్లేడ్ గణేశ్ అని పిలవద్దని బండ్ల గణేశ్ అని పిలవాలని ప్రేక్షకులను కోరాడు. గణేష్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే ఎవరైనా నేను, నా కొడుకు, నా వాళ్లు బాగుండాలని కోరుకోవడం న్యాయం, ధర్మం. కానీ, వాటన్నింటికీ అతీతుడు మెగాస్టార్ చిరంజీవి అంటూ.. ఒక మెగాస్టార్ మరో సూపర్‌స్టార్ కోసం వచ్చారు. ఆయన సంస్కారానికి పాదాభివందనాలు అంటూ.. మీరు (చిరంజీవి) వందేళ్లు చల్లగా ఉండాలన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. మీరు మహేశ్‌బాబు పక్కనే ఉంటే మరో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తీయొచ్చేమో అన్నారు. మెగాస్టార్ మళ్లీ నటించాలని బలంగా కోరుకున్న వారిలో నేనూ ఒకడిని అని.. అందుకోసం ఎందరో దేవుళ్లకు మొక్కానని అన్నారు. ఈ సినిమా తర్వాత నన్ను దయ చేసి బ్లేడ్ గణేశ్ అని ఎవరూ పిలవద్దు.. బండ్ల గణేశ్ అనే పిలవండంటూ.. ఇక నుంచి బండ్ల గణేశ్‌గానే మీ ముందు ఉండాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఈ సినిమాలో గణేష్ దొంగ పాత్రలో అలరించనున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Sarileru Neekevvaru