వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ ఛైర్మన్ సినీ నటి రోజా ఒకవైపు రాజకీయాలు, మరోవైపు జబర్ధస్త్ కామెడీ షో తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జబర్ధస్ట్ షో పక్కన పెడితే.. ఆమె రాజకీయంగా ఎంతో మంది నటీనటులతో విభేదిస్తూ ఉంటుంది. తాజాగా రోజాపై ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. గతంలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన రోజాపై బండ్ల గణేష్ ఎన్నోసార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో రోజా, బండ్ల గణేష్ మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి సెపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. బండ్ల గణేష్ సినిమాలే కాకుండా ఆయనకంటూ కోళ్లకు సంబంధించిన పౌల్ట్రీ పరిశ్రమ ఉంది. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుగులకు లోనవుతోంది. తాజాగా ఈయన రోజాపై ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టడం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా సందర్భంగా రోజా తన ఇంట్లోనే ఉండి తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చికెన్ వండుతూ కనిపించింది. ఇలాంటి సమయంలో చికెన్ మరియు గుడ్ల అవసరం ఎంతో ఉందో చెప్పినందకు ధన్యవాదాలు అంటూ బండ్ల గణేష్ రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు. రోజా గారి వల్ల మా లాంటి పౌల్ట్రీ పరిశ్రమపై ఉన్న అపోహలు తొలిగే అవకాశాలున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చికెన్ పై వస్తోన్న అపోహలను తొలిగిస్తే బాగుంటుందన్నారు. ఇక రోజా తన ఇంట్లో చేసిన చికెన్ వీడియోను పెట్టి ఆమెకు ధన్యవాదాలు తెలుపగా.. బండ్ల గణేషేనా ఈ ట్వీట్ చేసింది అంటూ అప్పటి రోజులను జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు అభిమానులు.
@RKRojaSelvamani thank you so much 🙏 pic.twitter.com/udOt109NdQ
— BANDLA GANESH (@ganeshbandla) March 28, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood