అమ్మతోడు ఇక పై ఆ పని చేయను.. స్టేజ్ పై చెంపలు వాయించుకున్న బండ్ల గణేష్..

Bandla Ganesh | ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ చేపిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు ఇకపై సినిమాలు తప్పించి వేరేవి చేయనని చెంపలు వాయించుకున్నాడు.

news18-telugu
Updated: January 5, 2020, 10:06 PM IST
అమ్మతోడు ఇక పై ఆ పని చేయను.. స్టేజ్ పై చెంపలు వాయించుకున్న బండ్ల గణేష్..
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ భావోద్వేగం (Ak Entertainments/Youtube)
  • Share this:
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ చేపిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు ఇకపై సినిమాలు తప్పించి వేరేవి చేయనని చెంపలు వాయించుకున్నాడు. బండ్ల గణేష్ విషయానికొస్తే.. గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయన.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పాడు.  ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో బండ్ల గణేష్.. రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. తాజాగా  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్.. కాస్తంత భావోద్వేగానికి గురయ్యాడు.ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చానని చెప్పాడు. మేనేజర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను.. నటుడిగా నిర్మాతగా మారాను. ఈ చిన్న గ్యాప్‌లో రాజకీయాల్లో వెళ్లి తప్పు చేశానన్నారు. అమ్మ తోడు ఇక నుంచి నేను సినిమాలే చేస్తాను. వేరే ఏ పనులు చేయనన్నారు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తాను బ్లేడ్ గణేష్ పాత్రను చేసానన్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తనను అలా పిలవద్దని బండ్ల గణేష్ కోరడం విశేషం.

First published: January 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు