BANDLA GANESH SENSATIONAL COMMENTS ON GABBAR SINGH DIRECTOR HARISH SHANKAR AND SAYS HE IS REMAKE DIRECTOR PK
హరీష్ శంకర్ Vs బండ్ల గణేష్.. ముదురుతున్న వివాదం..
బండ్ల గణేష్ వర్సెస్ హరీష్ శంకర్ (bandla ganesh vs harish shankar)
Bandla Ganesh: కొన్ని రోజులుగా వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు మళ్లీ రచ్చ చేసాడు. ఈయన నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా ఈ మధ్యే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది.
కొన్ని రోజులుగా వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు మళ్లీ రచ్చ చేసాడు. ఈయన నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమా ఈ మధ్యే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇండియాలోనే సోషల్ మీడియాలో అత్యధిక ట్వీట్స్ చేసిన సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది. ఈ సినిమా సాధ్యం కావడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయ పూర్వక నమస్కారాలు అంటూ హరీష్ శంకర్ లెటర్ రాసాడు. ప్రతీ ఒక్కరి పేరు అందులో ఉంది ఒక్క నిర్మాత బండ్ల గణేష్ పేరు తప్ప. సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన ఆయన్ని హరీష్ శంకర్ మర్చిపోయాడు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.
బండ్ల గణేష్ వర్సెస్ హరీష్ శంకర్ (bandla ganesh vs harish shankar)
ఇదే విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ దగ్గర అడిగితే ఆయన కూడా సంచలన సమాధానాలు చెప్పాడు. అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలడు.. స్ట్రెయిట్ సినిమా తీసి హిట్ కొట్టి చూపించమనండి ఈ ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా.. హరీష్ శంకర్ అనే డైరక్టర్‌కు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కల్పించింది నేను.. సినిమాలు లేక కిందా మీదా పడుతుంటే పవన్‌ను పరిచయం చేసింది నేను.. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న నల్లమలపు బుజ్జి ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్లో ఉంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను నేను.. ఫామ్ హౌజ్‌లో వుంటే తీసుకెళ్లి మిరపకాయ్ కథ పవన్ కళ్యాణ్‌కు వినిపించాను... ఆ తర్వాత అది కుదరకపోయినా కూడా గబ్బర్ సింగ్ అనుకున్నపుడు పవన్ గుర్తు పెట్టుకుని ఆ కుర్రాడ్ని పిలిపించండి అంటూ పిలిచాడు.
బండ్ల గణేష్ వర్సెస్ హరీష్ శంకర్ (bandla ganesh vs harish shankar)
అలా నేను లేకపోతే హరీష్ శంకర్‌కు గబ్బర్ సింగ్ వచ్చేది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బండ్ల గణేష్. ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్‌పై హరీష్ శంకర్ ఎలాంటి సమాధానం ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రీమేక్స్ మాత్రమే హిట్ కొడతాడు.. స్ట్రెయిట్ సినిమాలు హిట్ కొట్టలేడని బల్లగుద్ధి మరీ ఛాలెంజ్ చేసాడు బండ్ల గణేష్. మరి దీనికి హరీష్ నుంచి వచ్చే సమాధానం కోసమే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో తీయబోయే సినిమా దీనికి ఆన్సర్ అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.