బండ్ల గణేష్. తెలుగు ఇండస్ట్రీలో కామెడీ నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఏకంగా బడా నిర్మాత అయ్యాడు. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా ఏదో అల్లా టప్పా హీరోలతో సినిమాలు చేయలేదు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి బడా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. నటుడిగా బిజీగా ఉన్న బండ్ల ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా రాజీ లేని మాటలతో రెచ్చిపోయాడు. సెవెన్ ఓ క్లాస్ బ్లేడ్ అంటూ ఈయన చేసిన రచ్చ ఇప్పటికీ మరిచిపోలేం. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగినట్టు చెప్పి సంచలనం క్రియేట్ చేసాడు. నటుడిగా గ్యాప్ తీసుకున్న ఈయన చాలా రోజుల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్గా ఈయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత కోలుకున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోపలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. దానికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.
ఈ ప్రోమోలో బండ్ల గణేష్.. జగన్ పాలన, పవన్ కళ్యాణ్‌తో పాటు కరోనా వచ్చినపుడు చిరంజీవి తనకు ఫోన్ చేసిన విషయాలను ప్రస్తావించారు. ఆ సంగతి పక్కన పెడితే.. రీ ఎంట్రీలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేసి పెద్ద తప్పు చేసానంటూ చెప్పుకొచ్చాడు. ఆ పాత్ర నాకు ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. నాకు తెలిసిన వాళ్లందరు ఈ పాత్ర ఎందుకు చేసావు అంటూ తనను తిట్టి పోసినట్టు చెప్పుకొచ్చాడు. ఇకపై ప్రాధాన్యత లేని వేషాలు వేయనని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇకపై యాక్టింగ్ చేయదలుచుకోలేదు అంటూ సంచనల వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొత్తంగా ప్రోమోతోనే పెద్ద దుమారం రేపుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలు రేపు మొత్తం ఇంటర్వ్యూ తర్వాత ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Mahesh babu, Sarileru Neekevvaru, Tollywood