అవును.. నిజంగానే ఇప్పుడు బండ్ల గణేష్ గుట్టు బయటపడింది. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్.. ఈ మాట వినగానే మరో మాట లేకుండా గుర్తొచ్చే పేరు బండ్ల గణేష్. నటుడిగా ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా ఉన్నా రాని గుర్తింపు నిర్మాతగా కేవలం ఐదారేళ్లలో తెచ్చుకున్నాడు ఈయన. వరస సినిమాలు నిర్మించి.. స్టార్ హీరోలను కూడా బుట్టలో పడేసాడు. ఎవరికీ అర్థం కాని లాజిక్స్ చెప్పి.. హీరోలను దేవుళ్లను చేయడంలో గణేష్‌ది అందె వేసిన చేయి. టెంపర్ తర్వాత ఎందుకో కానీ నిర్మాణానికి దూరంగా ఉన్నాడు ఈ నిర్మాత.
వరస సినిమాలు నిర్మించినా కూడా గబ్బర్ సింగ్ తప్ప ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ లేదు ఈయన కెరీర్లో. కానీ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు. టెంపర్ సమయంలోనే సచిన్ జోషితో వివాదాలు.. ఆ తర్వాత నిర్మాణానికి దూరం కావడం జరిగిపోయాయి. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ఎన్నికల సమయంలో కాస్త పొలిటికల్ కామెడీ కూడా చేసాడు ఈ నిర్మాత. కాంగ్రెస్ ఓడిపోతే 7 క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ మనోడు చేసిన రచ్చ మామూలుగా పేలలేదు. ఈ మధ్యే మళ్లీ సినిమా నిర్మించాలని ఆశ పుట్టి పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెళ్తే ఆయనేమో నో చెప్పేసాడు.
దాంతో ఇప్పుడు చేసేదేం లేక నటన వైపు అడుగులేస్తున్నాడు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కమెడియన్‌గా నటిస్తున్నాడు ఈయన. గణేష్ పాత్రను స్పెషల్‌గా డిజైన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈయన లుక్ కూడా బయటికి వచ్చింది. బిగ్ బాస్ 1 కంటెస్టెంట్ హరితేజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బండ్ల గణేష్‌తో పాటు రష్మిక, అనిల్ రావిపూడి కూడా ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది. అందులోతనకు బ్యాండ్ కట్టుకుని.. టీ షర్ట్, జీన్స్‌తో కొత్తగా కనిపిస్తున్నాడు బండ్ల గణేష్. ఈ లుక్ చూసిన తర్వాత సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఐడియా వచ్చేసింది. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Mahesh babu, Telugu Cinema, Tollywood