Bandla Ganesh - Posani : పోసాని పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వారు..

బండ్ల గణేష్,పోసాని కృష్ణమురళి (File/Photo)

Bandla Ganesh - Posani : పోసాని పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. ఆయన ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వ్యక్తి. ఎక్స్‌పైరీ డేట్ అయిన టాబ్లెట్‌కు ఎలా విలువ ఉండదో.. పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలకు కూడా విలువ లేదన్నారు.

  • Share this:
    Bandla Ganesh - Posani : పోసాని పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.. ఆయన ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వ్యక్తి. ఎక్స్‌పైరీ డేట్ అయిన టాబ్లెట్‌కు ఎలా విలువ ఉండదో.. పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలకు కూడా విలువ లేదన్నారు. తాజాగా ఈయన ‘మా’అధ్యక్ష ఎన్నికల్లో జరనల్ సెక్రటరీ పదవికి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈనేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో ఇద్దరు గొప్ప వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో నిలబడి ఇచ్చిన హామిలను నేరవేర్చలేకపోతే తప్పు చేసినవాడిని అవుతానని ఈ ఎన్నికల బరిలోంచి పెద్దల సలహాతో తప్పుకోవాల్సి వచ్చిందన్నారు.

    ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ఇచ్చిన హామిలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో నేను ప్రకాష్ రాజ్ గారికే ఓటు వేస్తానని బండ్ల గణేష్ చెప్పడం గమనార్హం. ఆయనకు మద్దతుగానే ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు చెప్పారు. ఇక మంచు విష్ణు.. ఇండస్ట్రీ వైపు ఉన్నారా ? పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా అనే వ్యాఖ్యలకు బాధపడ్డాను. ఎందుకంటే పనవ్ కళ్యాణ్ ఇండస్ట్రీ రథ సారథి. అంతేకాదు తన సినిమాలతో ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. ఎవరికి ఏ సమస్య ఉన్న ఆయన స్పందిస్తారని ఈ సందర్భంగా బండ్ల గణేష్ ప్రస్తావించారు.

    Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..

    ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నా మీద కోపం ఉంటే.. నన్ను ఇబ్బంది పెట్టండి. వేరే హీరోలను ఇబ్బంది పెట్టొద్దని పవన్ కళ్యాణ్ కోరారు. ఆయన ఇండస్ట్రీ మనిషే కాదని  మంచు విష్ణు అనడం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. నేను ఇచ్చిన మాట పై నిలబడి ఉన్నారు. అంతేకాదు ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలవగానే.. ఆయన్ని ఒప్పించి 100 మంది పేద కళాకారులకు ఇళ్లను అందించే కార్యక్రమం చేపడతాన్నారు.

    James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..

    పోసాని గురించి మాట్లాడుతూ.. ఆయన ఓఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఆదుకోవాలని  కోరారు. ఇక పోసాని కృష్ణమురళి ఓ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై తన అభిప్రాయం వెలిబుచ్చారు. అంత వరకు ఓకే .. ఆ తర్వాత ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ తల్లి గురించి మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరోవైపు పోసాని కృష్ణమురళి భార్య గారంటే తనకు తల్లితో సమానమన్నారు. ఆమె పోసాని ఎలా భరిస్తున్నారో అని ఈ సందర్భంగా బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం కరెక్టే కానీ... అందులో కుటంబ సభ్యులను లాగడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: