హోమ్ /వార్తలు /సినిమా /

Bandla Ganesh: యాంకర్ సుమపై బండ్ల గణేష్ ఓపెన్ కామెంట్స్.. వేసేశాడు బాగా వేసేశాడు!!

Bandla Ganesh: యాంకర్ సుమపై బండ్ల గణేష్ ఓపెన్ కామెంట్స్.. వేసేశాడు బాగా వేసేశాడు!!

Photo Twitter

Photo Twitter

Anchor Suma: మాట్లాడుతూ మాట్లాడుతూనే పంచులు విసరడంతో మహా దిట్ట అయిన సుమకే చుక్కలు చూపించాడు బండ్ల గణేష్. సుమ వేసే కొంటర్లకు రివర్స్ పంచ్‌లు విసురుతూ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు బండ్లన్న.

ఒకరు బుల్లితెర సుమ మాటల మాంత్రికురాలు. మరొకరు వేదికపై మైక్ పట్టి దడలాడించే సత్తా ఉన్నోడు.. అలాంటి ఇద్దరు ఓ షోలో కలిస్తే ఇక ఆ హంగామా మామూలుగా ఉంటుందా చెప్పండి. తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమో వీడియోలో అదే కనిపించింది. యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ షోకి బండ్ల గణేష్ వచ్చి ఆట ఆడారు. మాట్లాడుతూ మాట్లాడుతూనే పంచులు విసరడంతో మహా దిట్ట అయిన సుమకే చుక్కలు చూపించాడు బండ్ల గణేష్. సుమ వేసే కొంటర్లకు రివర్స్ పంచ్‌లు విసురుతూ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు బండ్లన్న. ఆ పంచ్‌లు కూడా ప్రొఫెషనల్‌గా ఉండేలా వ్యాపార కోణంలో వదలడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

యాంకర్ సుమ షో హోస్ట్ చేస్తుందంటే అందులో పార్టిసిపేట్ చేసేవాళ్లకు ఏదో మూలాన చిన్న భయం అయితే ఉంటుంది. ఏ క్షణం ఏ కోణంలో తమ పంచ్ వేస్తుందోనని కాస్త ఏమరపాటుగా ఉంటూ ఉంటారు. కానీ బండ్ల గణేష్ మాత్రం అందుకు విరుద్ధంగా సుమనే ఓ ఆట ఆడేసుకున్నాడు. ఆమెపై వరుస పంచులు విసురుతూ ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. వచ్చే వారం ప్రసారం కాబోతున్న క్యాష్ ఎపిసోడ్‌కి డేగల బాబ్జీ టీం వచ్చింది. బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, డైరెక్టర్ వచ్చారు. అయితే తాజాగా ఈ షో తాలూకు ప్రోమో రిలీజ్ చేసి బుల్లితెర ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేశారు.

షోలో భాగంగా టమాటా కేజీ ఎంత అని సుమ ప్రశ్న వేయగా.. అవన్నీ మాకు తెలియదు కోడిగుడ్డు రేటు అడిగితే చెప్తా అని బండ్ల గణేష్ అన్నాడు. దీంతో ఒక్కసారిగా నవ్వేసింది సుమ. మీరంతా అమ్మే గుడ్లే మేము రోజు తింటున్నాం అని సుమ పంచ్ వేయగా.. మీరు ఇంత అందంగా ఉండటానికి కారణం నేను పంపిన కోడి గుడ్లే అంటూ రిటర్న్ కౌంటర్ వేసేశాడు బండ్ల గణేష్. దీంతో దెబ్బకు షాకైంది సుమ.

నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నిర్మాతగా ఎదిగి తెలుగు తెరపై తన మార్క్ చూపించారు బండ్ల గణేష్. రాజకీయాల్లోకి కూడా వెళ్లి అక్కడ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో తిరిగి కెమెరా ముందుకొచ్చారు. కామెడీ రోల్స్ చేస్తూనే హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ క్రమంలోనే డేగల బాబ్జీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మే 20వ తేదీన విడుదలైన ఈ మూవీకి ఆశించిన ఫలితం రాలేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

First published:

Tags: Anchor suma, Bandla Ganesh

ఉత్తమ కథలు