పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానం అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. గతంలో ఆయన నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో 'తీన్ మార్','గబ్బర్ సింగ్' వంటి సినిమాలు వచ్చాయి. తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ పిలిచి మరీ బండ్ల గణేష్ కు 'గబ్బర్ సింగ్' సినిమాకు అవకాశం ఇచ్చాడని ఎపుడు చెబుతుంటాడు. ఇక ఎన్టీఆర్‌తో చేసిన 'టెంపర్' సినిమా హిట్ తరువాత బండ్ల గణేష్ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. ఆ తర్వాత రాజకీయాల్లో వెళ్లి.. చేతులు కాల్చుకొని.. తిరిగి మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరునేకెవ్వరు' సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. తాజాగా మరోసారి రంగంలోకి దిగి పవన్ ఇష్యూ బయటకు తీశాడు బండ్ల గణేష్. వివరాల్లోకి పోతే..గత అసెంబ్లీ ఎన్నికల్లో తెగ హంగామా చేసి అందరి చూపు తనవైపు తిప్పుకున్నగణేష్ .. ఎలక్షన్స్ అనంతరం సైలెంట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరిగి మరో యూ టర్న్ తీసుకునే దిశగా బండ్ల గణేష్ అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలావుంటే ... పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదలై సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇదిలా ఉండగానే క్రిష్ దర్శకత్వంలో మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్. ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించనున్నాడు.ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాకి బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? అంటూ ఓ వ్యక్తి ట్విట్టర్లో పోల్ నిర్వహించాడు.
Jaiiiiiii @PawanKalyan 🙏🏻 pic.twitter.com/kRRgpawEgQ
— BANDLA GANESH (@ganeshbandla) March 3, 2020
దీనికి ఏఎం రత్నం, దిల్ రాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్, బండ్ల గణేశ్ అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో బండ్ల గణేష్ పైనే అందరూ మొగ్గు చూపారు. ఈ కాంటెస్టులో బండ్ల గణేశ్‌కు 51 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో ఇది చూసి బండ్ల గణేశ్ హర్షం వ్యక్తం చేశారు. తనకు చాలా మంది ఓటు వేశారని చెబుతూ సదరు స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశాడు బండ్ల గణేష్. అంతేకాదు 'జై పవన్ కళ్యాణ్' అంటూ ట్యాగ్ చేశాడు. ఈ పరిణామాలు చూస్తోంటే గణేష్.. పవన్ కళ్యాణ్‌తో మరో సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్.. బండ్ల గణేష్ పై దయ తలుస్తాడా ? లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Pawan kalyan, Telugu Cinema, Tollywood, Vakeel Saab