Bandla Ganesh: ప్రభాస్, రాజమౌళి నాన్ లోకల్.. మా ఎలక్షన్స్ నేపథ్యంలో బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు..

ప్రభాస్, రాజమౌళిపై బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు (Twitter/Photo)

Bandla Ganesh: తెలుగు సినీ ఇండస్ట్రీలో త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్.. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతుండటంతో లోకల్, నాన్ లోకల్ అంటూ ఇష్యూ మొదలైంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ .. ప్రభాస్, రాజమౌళి విషయంలో లోకల్ , నాన్ లోకల్ అంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.

  • Share this:
    Bandla Ganesh: తెలుగు సినీ ఇండస్ట్రీలో త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్.. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతుండటంతో లోకల్, నాన్ లోకల్ అంటూ ఇష్యూ మొదలైంది. ఇప్పటికే కరాటే కళ్యాణి.. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. నేను ప్రాంతాలతో సంబంధం లేకుండా యూనివర్సల్ నటుడు అంటూ ప్రెస్‌మీట్లో చెప్పారు. మరోవైపు మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ‘మా’ అసోసియేషన్‌ ఉన్నతికి ప్రకాష్ రాజ్ ముందుకు వచ్చారన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. నాన్ అనేది అప్రస్తుతం. ‘మా’ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల్లో పోటీ చేయోచ్చన్నారు. ప్రకాష్ రాజ్‌కు మేము పూర్తిగా మద్ధతు ఇస్తున్నట్టు నాగబాబు స్పష్టం చేసశారు.

    మరోవైపు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మాట్లాడుతూ.. గత 23 యేళ్ల నుంచి ప్రకాష్ రాజ్ తనకు తెలుసన్నారు. ఆయన చేసిన పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూసాను. ఎంతో మంది కళాకారుల పిల్లల పెళ్లిళ్లలకు డబ్బులు పంపిన సహృదుయుడు. ప్రకాష్ రాజ్ విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే విషయాన్ని తీసుకురావడం అప్రస్తుతం అన్నారు. ఇక్కడ పుట్టిన ప్రభాస్, రాజమౌళి ప్యాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇండియన్ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. ఇక్కడ ఎవరు లోకల్.. ఎవరు నాన్ లోకల్ అంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.  వాళ్లను హిందీ పరిశ్రమలో నాన్ లోకల్ అంటే ఊరుకుంటామా అని అన్నారు.



    ఒకసారి షాద్ నగర్ వస్తే.. ప్రకాష్ రాజ్ ఎలాంటి వ్యక్తే తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా నన్నుఇంటర్వ్యూలకు పిలవొద్దంటూ బండ్ల గణేష్ అన్నారు. నాకు మైక్ ఇస్తే బీపీ వస్తోంది. నాకు బీపీ వస్తే ఏం మాట్లాడుతానే తననే తెలియదన్నారు. అపుడు మీడియా దానికి పెద్ద కాంట్రవర్సీ చేస్తోంది. ఇలాంటివి తనకు తెలియదన్నారు. మొత్తంగా ప్రకాష్ రాజ్ ఎపిసోడ్‌లో ప్రభాస్, రాజమౌళిని కూడా లోకల్, నాన్ లోకల్ అంటూ కాస్త లాజిక్‌గానే మాట్లాడి.. ప్రకాష్‌రాజ్‌కు అండగా నిలబడ్డారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: