బండ్ల గణేష్.. కమెడియన్ టూ కాంట్రవర్సీ కింగ్.. చిత్రమైన జర్నీ..

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తుంది. ఈయన్ని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఏసీపీ కార్యాలయానికి తరలించడం అన్నీ సంచలనమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 23, 2019, 10:36 PM IST
బండ్ల గణేష్.. కమెడియన్ టూ కాంట్రవర్సీ కింగ్.. చిత్రమైన జర్నీ..
బండ్ల గణేష్ ఫైల్ ఫోటో (Bandla Ganesh)
  • Share this:
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తుంది. ఈయన్ని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఏసీపీ కార్యాలయానికి తరలించడం అన్నీ సంచలనమే. మరో నిర్మాత పివిపిని బెదిరించాడని ఈయనపై చాలా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. తెలుగులో ఈయన కమెడియన్‌గానే కాకుండా నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే కాంట్రవర్సీల్లో కూడా ఎప్పుడూ గణేష్ ముందే ఉంటాడు. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ నిర్మాతగా హీరోలను పొగిడేస్తూ.. వాళ్లకు గిఫ్టులుస్తూనే మరోవైపు అప్పులు, తప్పులు చేస్తూనే ఉంటాడు. ఏదేమైనా కూడా తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్ పేరు తెలియని వాళ్లుండరేమో..? నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. మొదట్లో బూతు సినిమాలు కూడా చేసాడు. ఇదే విషయాన్ని తానే చెప్పాడు కూడా.
Bandla Ganesh arrested by jubilee hills police and he became most controversial producer in tollywood pk నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తుంది. ఈయన్ని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఏసీపీ కార్యాలయానికి తరలించడం అన్నీ సంచలనమే. bandla ganesh,bandla ganesh twitter,bandla ganesh controversy,bandla ganesh check bounce case,bandla ganesh arrest,hyderabad police arrest bandla ganesh,pvp bandla ganesh,pvp vs bandla ganesh,potluri vara prasad,tollywood news,hyderabad police,hyderabad news,telugu news,bandla ganesh,bandla ganesh twitter,bandla ganesh instagram,bandla ganesh producer,bandla ganesh binami,bandla ganesh seven o clock blade,bandla ganesh controversy,bandla ganesh mahesh babu,bandla ganesh check bounce,bandla ganesh pvp,bandla ganesh pvp war,bandla ganesh interview,bandla ganesh on pawan kalyan,bandla ganesh politics,bandla ganesh exclusive interview,bandla ganesh quits politics,bandla ganesh goodbye to politics,producer bandla ganesh quits politics,bandla ganesh says good bye to politics,reason behind bandla ganesh quits politics tv 9,telugu cinema,బండ్ల గణేష్,బండ్ల గణేష్ వివాదం,బండ్ల గణేష్ రాజకీయాలు,బండ్ల గణేష్ నిర్మాత,బండ్ల గణేష్ కాంట్రవర్సీ,తెలుగు సినిమా,బండ్ల గణేష్ అరెస్ట్, సినీ నిర్మాత బండ్ల గణేష్, పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్,
బండ్ల గణేష్ ఫైల్ ఫోటో


ఎప్పటికప్పుడు వినోదం సృష్టిస్తూనే.. మరోవైపు వివాదాస్పదంగా కూడా ఉంటాడు. ఈయన మిస్టీరియస్ పర్సన్.. అజ్ఞాతవాసిలో పవన్ కల్యాణ్ గురించి చెప్పినట్లు ఈయన చర్యలు కూడా ఊహకందవు. ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. నటుడిగా బిజీగా ఉన్న బండ్ల ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా రాజీ లేని మాటలతో రెచ్చిపోయాడు. సెవెన్ ఓ క్లాస్ బ్లేడ్ అంటూ ఈయన చేసిన రచ్చ ఇప్పటికీ మరిచిపోలేం. ఇవన్నీ ఇలా ఉంటే బండ్ల గణేష్‌పై ఉన్న ప్రధానమైన వివాదం చెక్ బౌన్స్ కేస్. అప్పట్లో సచిన్ జోషితో పాటు మరో నిర్మాతతో కూడా ఆర్థికపరమైన వివాదాలు బాగానే ఉన్నాయి ఈ నిర్మాతకు.

bandla ganesh,bandla ganesh vs pvp,bandla ganesh warns pvp,bandla ganesh vs pvp over financial disputes,pvp vs bandla ganesh,producer bandla ganesh,bandla ganesh threatens ycp leader pvp,ycp leader pvp case file on bandla ganesh,pvp warns bandla ganesh,bandla ganesh speech,bandla ganesh on pvp,bandla ganesh comedy,pvp,tollywood producer bandla ganesh,bandla ganesh movies,bandla ganesh pvp,బండ్ల గణేశ్,పీవీపీ,పొట్లూరి వరప్రసాద్,బండ్ల గణేశ్ పీవీపీ వివాదం
బండ్ల గణేష్,పీవీపీ


పైగా ఉన్నట్లుండి సినిమాలు నిర్మించడం ఆపేసాడు గణేష్. ఈయనపై చాలా చెక్ బౌన్స్ కేసులున్నాయని.. ఇప్పుడు తాజాగా రాయలసీమ ప్రొద్దుటూరులో ఉండే కొందరు వ్యాపారస్థులు కూడా బండ్లపై కేస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఈయనపై పదుల సంఖ్యలో చెక్ బౌన్స్ కేసులున్నాయంటారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు పివిపితో శత్రుత్వం మనోడ్ని మరింత హైలైట్ చేస్తుంది. తన దగ్గర్నుంచి 30 కోట్లు తీసుకుని.. 23 కోట్లు చెల్లించి మరో 7 కోట్లు ఎగ్గొట్టాడని బండ్లపై ఫైర్ అవుతున్నాడు పివిపి. ఇక ఇదే విషయంలో కొన్ని రోజులుగా స్కామ్ రాజా అంటూ పివిపిని తెగ ఎక్కేస్తున్నాడు గణేష్. మరోవైపు పివిపి కూడా బండ్ల గణేష్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య యుద్ధం పీక్స్‌కు చేరిపోయింది.

Bandla Ganesh arrested by jubilee hills police and he became most controversial producer in tollywood pk నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తుంది. ఈయన్ని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఏసీపీ కార్యాలయానికి తరలించడం అన్నీ సంచలనమే. bandla ganesh,bandla ganesh twitter,bandla ganesh controversy,bandla ganesh check bounce case,bandla ganesh arrest,hyderabad police arrest bandla ganesh,pvp bandla ganesh,pvp vs bandla ganesh,potluri vara prasad,tollywood news,hyderabad police,hyderabad news,telugu news,bandla ganesh,bandla ganesh twitter,bandla ganesh instagram,bandla ganesh producer,bandla ganesh binami,bandla ganesh seven o clock blade,bandla ganesh controversy,bandla ganesh mahesh babu,bandla ganesh check bounce,bandla ganesh pvp,bandla ganesh pvp war,bandla ganesh interview,bandla ganesh on pawan kalyan,bandla ganesh politics,bandla ganesh exclusive interview,bandla ganesh quits politics,bandla ganesh goodbye to politics,producer bandla ganesh quits politics,bandla ganesh says good bye to politics,reason behind bandla ganesh quits politics tv 9,telugu cinema,బండ్ల గణేష్,బండ్ల గణేష్ వివాదం,బండ్ల గణేష్ రాజకీయాలు,బండ్ల గణేష్ నిర్మాత,బండ్ల గణేష్ కాంట్రవర్సీ,తెలుగు సినిమా,బండ్ల గణేష్ అరెస్ట్, సినీ నిర్మాత బండ్ల గణేష్, పీవీపీని బెదిరించిన బండ్ల గణేష్,
బండ్ల గణేష్ ఫైల్ ఫోటో (Source: Instgram/ Hari Teja)


బండ్ల గణేష్ తన ఇంటికి అనుచరులతో వచ్చి బెదిరించాడని కేస్ పెట్టడంతో ఈయన్ని అరెస్ట్ చేసారు పోలీసులు. ఓ వైపు చెక్ బౌన్స్ కేసులు.. మరోవైపు రాత్రికి రాత్రే నిర్మాత అయిపోవడం.. ఇంకోవైపు కోడిగుడ్ల వ్యాపారం.. ఇలా బండ్ల ఏం చేసినా కూడా సంచలనమే. ఈయన ఓ రాజకీయ నాయకుడికి బినామి అంటూ అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది. మొత్తానికి ఎప్పుడూ ఏదో ఓ వార్తతో వార్తల్లోనే ఉంటాడు బండ్ల గణేష్. ఈయనపై లెక్కకు మించి చెక్ బౌన్స్ కేసులున్నాయని.. ఇన్ని కేసులు ఉన్న నిర్మాత ఇండస్ట్రీలో మరొకరు లేరనే టాక్ కూడా వినిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈయన మళ్లీ నటన వైపు వస్తున్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈయన నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉండగానే ఇప్పుడు అరెస్ట్ అయిపోయి మరోసారి వార్తల్లో నిలిచాడు ఈయన.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading