BANDLA GANESH ACTOR AND PRODUCER BANDLA GANESH ATTEND COURT AGAIN IN CHECK BOUNCE CASE TA
Bandla Ganesh : చెక్ బౌన్స్ కేసులో మరోసారి కోర్టు మెట్లెక్కిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్..
బండ్ల గణేష్ (File/Photo)
Bandla Ganesh Cheque Bounce Case | తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తాజాగా ఈయన ఓ చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కారు.
Bandla Ganesh Cheque Bounce Case | తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన నటుడిగా కంటే కూడా నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు. మరోవైపు రాజకీయాల్లో అడుగుపెట్టి పెద్ద తప్పు చేసాను మళ్లీ పాలిటిక్స్ జోలికి వెళ్లను అంటూ లెంపలేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈయన నటుడిగా నిర్మాతగా కన్న.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా టాలీవుడ్లో ఎక్కువగా ఫేమసయ్యారు.అప్పట్లో నటుడు సచిన్ జోషితో ఆర్టిక వ్యవహారాల్లో కోర్టు మెట్లెక్కిన ఈయన.. తాజాగా ఈయన ఓ చెక్ బౌన్స్ కేసులో మరోసారి కోర్టు మెట్లెక్కారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో బండ్ల గణేష్ హాజరయ్యారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ఇచ్చిన రూ. కోటి రూపాయలకు ఇచ్చి చెక్ బౌన్స్ అయింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఈ రోజు (సోమ వారం) బండ్ల గణేష్ కోర్టుకు హాజరయ్యారు. ఆయన కారు దిగి తన వకీల్లతో కలిసి కోర్టు వెళుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇన్నేళ్ల కెరీర్లో నటుడిగా కమెడియన్‌గా నిర్మాతగా అలరించినా బండ్ల గణేష్.. ఇపుడు హీరోగా ‘డేగల బాబ్జీ’గా పలకరించనున్నారు. ‘డేగల బాబ్జీ’ సినిమాను వెంకట్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బ్లేడ్‌తో బండ్ల గణేష్ తలపై బ్లేడ్‌తో కట్ చేసినట్టు లుక్‌ను డిజైన్ చేసారు.
బండ్ల గణేష్ నటుడిగా కంటే కూడా నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తన స్పీచులతో.. మాటలతో అందర్నీ పడగొడుతుంటాడు బండ్ల గణేష్. దానికి తోడు పవన్ కళ్యాణ్ భక్తుడిగానూ గుర్తింపు ఉంది. ఇన్నాళ్ళూ నటుడిగా, నిర్మాతగా ఉన్న ఈయన.. ఇప్పుడు హీరోగా పలకరించబోతున్నారు.
వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్1గా స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘డేగల బాబ్జీ’ సినిమా తమిళ హిట్టైన 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి రీమేక్‌గా తెరకెక్కతోంది.
తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్ప్రైజ్. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ’ఒత్తు సెరుప్పు సైజ్ 7'ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.