కూరగాయలు అమ్ముతున్న దర్శకుడు.. షాక్ అవుతున్న అభిమానులు..

కరోనా చాలా మంది జీవితాలను మార్చేసింది. అప్పటి వరకు బాగా బతికిన వాళ్లు కూడా కరోనాలో దారుణంగా కష్టపోయారు. చేతుల్లో డబ్బుల్లేక.. ఖర్చులకు తిప్పలు పడి చివరికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 28, 2020, 8:33 PM IST
కూరగాయలు అమ్ముతున్న దర్శకుడు.. షాక్ అవుతున్న అభిమానులు..
బాలిక వధు దర్శకుడు రామ్ గౌర్ (balika vadhu director)
  • Share this:
కరోనా చాలా మంది జీవితాలను మార్చేసింది. అప్పటి వరకు బాగా బతికిన వాళ్లు కూడా కరోనాలో దారుణంగా కష్టపోయారు. చేతుల్లో డబ్బుల్లేక.. ఖర్చులకు తిప్పలు పడి చివరికి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా లేకపోలేరు. మరికొందరు మాత్రం బతుకుదెరువు కోసం ఏదో ఒక పని చేస్తున్నారు. చాలా మంది అందులో కులవృత్తులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మరో దర్శకుడు కూడా కరోనా సమయంలో కూరగాయలు అమ్ముతున్నాడు. ఆయన పేరు రామ్ విృక్ష కౌర్. కలర్స్‌ టీవీలో ప్రసారమైన ‘బాలికా వధు’ సీరియల్‌కి ఈయన అసిస్టెంట్ డైరెక్టర్. ఈ సీరియల్‌కు ఇండియాలో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బాలిక వధు దర్శకుడు రామ్ గౌర్ (balika vadhu director)
బాలిక వధు దర్శకుడు రామ్ గౌర్ (balika vadhu director)


మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా బాలికా వధు దుమ్ము దులిపేసింది. తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’గా డబ్ అయి ఇక్కడా రికార్డులు తిరగరాసింది. ఈ సీరియల్ అసిస్టెంట్ డైరక్టర్‌ ప్రస్తుతం ఓ తోపుడు బండి మీద కూరగాయలమ్ముకుంటున్నాడు. నమ్మడం కష్టమే.. వినడానికి కాస్త బాధే అయినా కూడా ఇదే నిజం. కరోనా కారణంగా బాలికా వధు సీరియల్‌ దర్శకుల్లో ఒకరైన రామ్‌ వ్రిక్ష గౌర్‌ ప్రస్తుతం అజంగఢ్‌ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. దీన్ని తాను సిగ్గుగా భావించడం లేదంటున్నాడు ఈయన. ఓ సినిమా కోసం రెక్కి నిర్వహించడానికి తాను అంజగఢ్‌ వచ్చానని.. అంతలోనే లాక్‌డౌన్‌ విధించారని తెలిపాడు ఈయన.
బాలిక వధు దర్శకుడు రామ్ గౌర్ (balika vadhu director)
బాలిక వధు దర్శకుడు రామ్ గౌర్ (balika vadhu director)

ఆ తర్వాత తిరిగి వెళ్లడానికి ప్రయత్నించినా కూడా కుదర్లేదని చెప్పాడు. దానికితోడు సినిమా కూడా మరో ఏడాది పడుతుందని తెలపడంతో అక్కడే ఉండిపోయాడు రామ్. తన తండ్రి వ్యాపారాన్ని నిర్వహించాలనుకున్నాడు.. అందుకే ఇలా తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నాడు రామ్ విృక్ష. తన ప్రయాణం గురించి చెప్తూ.. 18 ఏళ్ల కింద అంటే 2002లో తన స్నేహితుడు, రచయిత షహనాజ్‌ ఖాన్‌ సాయంతో ముంబై వెళ్లినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎక్కుతూ బాలికా వధు సీరియల్‌కు యూనిట్ అండ్ ఎపిసోడ్ డైరెక్టర్‌గా పని చేసాడు. ఏదేమైనా కూడా ఎంతో బాగా బతికిన ఈయన ఇప్పుడు కూరగాయలు అమ్ముకోవడం చూసి అంతా బాధ పడుతున్నారు. కానీ అందులో తప్పేం లేదు.. తన కుటుంబం కోసం చేస్తున్నానంటున్నాడు రామ్.
Published by: Praveen Kumar Vadla
First published: September 28, 2020, 8:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading