Unstoppable With NBK S2 4th Episode Prome: చూడు ఓవైపు చూడు.. అంటూ బాలయ్య సినిమాలో చెప్పినట్టు అన్‌స్టాపబుల్ షోతో బాలకృష్ణలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఈ షోలో ఎంతో ఈజ్‌తో చేసి హోస్ట్‌గా కెవ్వు కేక పుట్టించారు. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 స్టార్ట్ అయింది. నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటు రాజకీయాలతో పాటు.. అటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా మారారు. అయితే ఈ క్రమంలో బాలయ్య ఓటీటీలోకి వచ్చి అందర్నీ షాక్ ఇచ్చారు. బాలయ్య చేస్తున్న ప్రముఖ ఓటీటీ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్లో మూడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. తాజాగా నాల్గో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ ఎపిసోడ్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్ కే.ఆర్. సురేష్ రెడ్డి సందడి చేయనున్నారు. వీళ్లిద్దరు బాలయ్యతో నిజాం కాలేజీలో కలిసి చదువుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి కాకముందు..ఉమ్మడి ఏపీ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. ఇక సురేష్ రెడ్డి టీఆర్ఎస్ తరుపు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వీరితో పాటు అలనాటి కథానాయిక రాధిక కూడా సందడి చేసింది. ఈ ఎపిసోడో ఈ నెల 25న ప్రీమియర్ కానుంది.
Balayya kutumbanni chusaru. Balayya abhimanulni chusaru. Kani Balayya snehithulni chusara? Vallatho Balayya chese saradha allarini chusthara? #UnstoppableWithNBKS2 - Episode 4 | Premieres Nov 25 ▶️ https://t.co/x862MUAP1h#MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India pic.twitter.com/fjmJEAGEAf
— ahavideoin (@ahavideoIN) November 17, 2022
ఈ సందర్భంగా బాలయ్య. తన చిన్ననాటి స్నేహితులైన కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సురేష్ రెడ్డితో కాలేజీ జ్ఞాపకాలను పంచుకున్నారు. మరోవైపు రాధికతో తనతో ఎందుకు హీరోయిన్గా నటించలేదనే క్వశ్వన్ కూడా అడిగారు. ఇక వీళ్లిద్దరు హీరో, హీరోయిన్లుగా నటించకపోయినా.. తల్లి కొడుకులుగా వంశోద్దారకుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. అందులో కృష్ణంరాజు భార్య పాత్రలో రాధిక నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఎపిసోడ్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది.
అన్‌స్టాపబుల్ సీజన్ 1లో అంతా సినిమా తారలే వస్తే.. సెకండ్ సీజన్లో మాత్రం కాస్త వెరైటీగా సినీ నటులతో పాటు రాజకీయ నేతలను కూడా ఈ షోకు గెస్ట్లుగా పిలుస్తున్నారు. ఈ సీజన్2లో తొలి ఎపిసోడ్లో ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు కమ్ బాలయ్య అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులగా హాజరై సందడి చేశారు. రెండో ఎపిసోడ్లో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ వంటి యువ నటులతో సందడి చేశారు. మూడో ఎపిసోడ్లో అడవి శేష్, శర్వానంద్ గెస్ట్లుగా సందడి చేశారు.
కానీ నాల్గో ఎపిసోడ్లో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డితో పాటు రాధిక శరత్ కుమార్ గెస్ట్‌లు సందడి చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో నెటింట వైరల్ అవుతోంది. మరి ఈ ఎపిసోడ్ ఎపుడెపుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలయ్య వీరిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. వైయస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం తదితర ప్రశ్నలు ప్రోమోలో చూపించారు. మరి ఈ ఎపిసోడ్ ఈ శుక్రవారం కాకుండా నెక్ట్స్ ఫ్రైడే నవంబర్ 25న ప్రీమియర్ కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Balayya, Nallari Kiran Kumar Reddy, Raadhika Sarathkumar, Suresh Reddy, Tollywood, Unstoppable With NBK S2