‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఆ ఎపిసోడ్‌తోనే ఎండ్ అవుతుంది..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్‌గా మారారు. ఆయన సినీ జీవితంపై ఎవరికీ ఎలాంటి కంప్లైట్స్ లేవు. కానీ అన్నగారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎన్నో ట్విస్టులున్నాయి. తాజాగా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాపై హీరో బాలకృష్ణ..తన మనసులో మాట చెప్పాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 21, 2019, 12:48 PM IST
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఆ ఎపిసోడ్‌తోనే ఎండ్ అవుతుంది..
మహానాయకుడు పోస్టర్
  • Share this:
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్‌గా మారారు. ఆయన సినీ జీవితంపై ఎవరికీ ఎలాంటి కంప్లైట్స్ లేవు. కానీ అన్నగారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎన్నో ట్విస్టులున్నాయి. అప్పటి వరకు తెలుగు రాష్ట్రమైన ఏపీలో తిరుగులేకుండా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి తన తెలుగుదేశం పార్టీతో చుక్కులు చూపించాడు ఎన్టీఆర్. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమ గీతం పాడి తెలుగు రాష్ట్ర ప్రజలకు టీడీపీ అనే ప్రత్యామ్నాయ పార్టీ ఒకంటుందని చెప్పడంలో సక్సెస్ అయ్యారు ఎన్టీఆర్.

తాజాగా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాపై హీరో బాలకృష్ణ..తన మనసులో మాట చెప్పాడు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా తన తల్లి బసవతారకం పాత్ర కథ చెప్పడంతో ప్రారంభమవుతోంది.

అలాగే బసవతారకమ్మ కాన్సర్ వ్యాధితో చనిపోవడంతో ఈ సినిమా ముగుస్తుందని బాలయ్య ..ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేశారు. అంటే ఈ సినిమాలో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంతో ఈ సినిమా కథ ముగుస్తుందని తేల్చిపారేశాడు. మొత్తానికి వెండితెరపై ఎన్టీఆర్ సినీ జీవితం వర్కౌట్ కాలేదు. ఎన్నో ట్టిస్టులున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఏ మేరకు సక్సెస్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ.

First published: February 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>