హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్టీఆర్‌తో పాటు ఆ ఛాన్స్ దక్కించుకున్న రామ్ చరణ్‌

ఎన్టీఆర్‌తో పాటు ఆ ఛాన్స్ దక్కించుకున్న రామ్ చరణ్‌

‘ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ పోస్టర్స్

‘ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ పోస్టర్స్

సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాలను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలతో పాటు ఆయా హీరోలు భావిస్తుంటారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం స్పెషల్ షోస్ వేయడం ఎప్పటి నుంచో ఉంది.

  సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాలను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలతో పాటు ఆయా హీరోలు భావిస్తుంటారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం స్పెషల్ షోస్ వేయడం ఎప్పటి నుంచో ఉంది.

  ఇప్పటికే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీమ్‌కు జనవరి 9 నుంచి 16 వరకు వరుసగా 8 రోజుల పాటు రోజు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ గవర్నమెంట్ ప్రత్యేక జీవో జారీ చేసింది.
  దీంతో నందమూరి అభిమానులు సంక్రాంతి ముందే పండగ చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటికే రిలీజైన ‘కథానాయకుడు’ ప్రోమోలు, వీడియోలు ఈసినిమాపై అంచనాలు పెంచాయి.

  మరోవైపు ఈనెల 11న విడుదల కాబోతున్న రామ్ చరణ్, బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ సినిమాకు జనవరి 11 నుంచి 19 వరకు 8 రోజుల పాటు రోజు ఆరు షోలు ప్రదర్శించేందకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ షోలు ఉంటాయని పేర్కొంది.

  వినయ విధేయ రామ స్పెషల్ షోస్ పర్మిషన్ ఇన్ ఏపీ

  దీంతో మెగాఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటును ఏ సినిమా ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

  First published:

  Tags: Bala Krishna Nandamuri, Boyapati Srinu, Krish, NTR Biopic, Ram Charan, Telugu Cinema, Tollywood, Vidya Balan

  ఉత్తమ కథలు