‘ఎన్టీఆర్’ మహానాయకుడు నుంచి ‘రాజర్షి’ సాంగ్ విడుదల

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీలో ‘కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు..మనిషివో..ఋషివో..రాజర్షివో అంటూ మరో పాటను విడుదల చేసారు.

news18-telugu
Updated: December 12, 2018, 11:41 AM IST
‘ఎన్టీఆర్’ మహానాయకుడు నుంచి ‘రాజర్షి’ సాంగ్ విడుదల
‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీలో సీన్
news18-telugu
Updated: December 12, 2018, 11:41 AM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.

మహానటుడు రామారావు జీవితాన్ని ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదు కాబట్టి..ఎన్టీఆర్..సినీ ప్రస్థానాన్ని ..‘ఎన్టీఆర్..కథానాయకుడు’ పేరుతో రామారావు ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్


రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ‘ఘనకీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా’..అంటూ రిలీజ్ చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత అచ్చమైన తెలుగు పదాలతో రిలీజ్ చేసిన ఈ పాట కథానాయకుడిగా ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో తెలిపేలా ఉంది.



‘ఎన్టీార్’ బయోపిక్‌లో రావణ బ్రహ్మ గెటప్‌లో బాలకృష్ణ
‘ఎన్టీార్’ బయోపిక్‌లో రావణ బ్రహ్మ గెటప్‌లో బాలకృష్ణ


తాజాగా ఈ మూవీలో ‘కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు..మనిషివో..ఋషివో..రాజర్షివో అంటూ మరో పాటను విడుదల చేసారు. ఈ పాట కూడా పదహారాణాల అచ్చు తెలుగు పదాలతో కీరవాణి డా.కే.రామకృష్ణ సహాకారంతో ఈ పాటను శివదత్త రాశారు. మరోవైపు జగద్గురు ఆదిశంకరాచార్యుల నిర్వాణ షట్కమ్ నుంచి కొన్ని పదాలను ఈ పాట కోసం వాడుకున్నారు.

మొత్తానికి మహానాయకుడిగా ఎన్టీఆర్ కీర్తిని ఈ పాటను చాటిచెప్పింది. ఈ పాటను శరత్ సంతోష్, మోహన భోగరాజు, శ్రీనిధి తిరుమల, కాలబైరవతో పాటు కీరవాణి పాడారు. మొత్తానికి చాల రోజుల తర్వాత అచ్చమైన తెలుగు పదాలతో రెండు పాటలు రాబోతున్నాయి. ఈ మూవీలో మొత్తంగా 4 బిట్స్ సాంగ్స్‌తో కలిపి 10 పాటలున్నాయని చెబుతున్నారు. తొందర్లనే ఈ మూవీలో ఉన్న పాటలను త్వరలో రిలీజ్ చేయనున్నారు.


ఇది కూడా చదవండి 

#HappyBirhtDay:సూపర్ స్టార్ రజినీకాంత్

చిరంజీవి, వెంకటేశ్ అయిపోయారు...బాలయ్యపై పడ్డ అల్లరి

ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్ దిలీప్ కుమార్

 
First published: December 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...