‘ఎన్టీఆర్..కథానాయకుడు’లో అసలు ఘట్టాన్ని పూర్తి చేసిన బాలయ్య

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు ఒక కొలిక్కి వచ్చాయి.

news18-telugu
Updated: December 14, 2018, 9:53 AM IST
‘ఎన్టీఆర్..కథానాయకుడు’లో అసలు ఘట్టాన్ని పూర్తి చేసిన బాలయ్య
ఎన్టీఆర్ బయోపిక్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.

మహానటుడు రామారావు జీవితాన్ని ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదు కాబట్టి..ఎన్టీఆర్..సినీ ప్రస్థానాన్ని ..‘ఎన్టీఆర్..కథానాయకుడు’ పేరుతో రామారావు ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. రెండో పార్ట్‌ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల చేయనున్నారు.

రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్’ బయోపిక్


ఈ మూవీలో కళ్యాణ్ రామ్...వాళ్ల తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు చంద్రబాబుగా రానా..అక్కినేనిగా ఆయన మనవడు సుమంత్..శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను 16వ తేదిన రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఈ మూవీ ఆడియో లాంఛ్‌ను ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులో డిసెంబర్ 21న భారీ ఎత్తున జరపునున్నారు.‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీలో సీన్


తాజాగా సంక్రాంతికి విడుదల కానున్న ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ పార్ట్‌కు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి కావొస్తోంది. ఇప్పటికే పిక్చరైజ్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే..బాలయ్య తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తిచేశారట.

ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్
మరోవైపు ఈ మూవీలో యాక్ట్ చేసే ఒకరిద్దరు మినహాయిస్తే...మిగిలిన నటీనటులు తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పారట. మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ మూవీకి సంబంధించిన అన్ని పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి.


ఇది కూడా చదవండి 

ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్.. ఆడియో లాంఛ్‌ తేదీలు ఖరారు..

ఎన్నికల్లో ఎన్టీఆర్ భలే తప్పించుకున్నాడుగా..

నాగ‌బాబు చేసిన ప‌నికి వ‌రుణ్ తేజ్ బ‌లి అవ్వ‌నున్నాడా..?

 
First published: December 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు