ఈ నెల 14న సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లను పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరులు కాశ్మీర్‌లోని పుల్వామా దగ్గర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడిలో కన్నుమూసిన సైనికుల కోసం కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు 40 మంది వీర జవాన్ల మరణానికి ధీటైన సమాధానం కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీర జవానుల వీర మరణంపై భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రతీకారం తీర్చుకుంది.
మంగళవారం తెల్లవారుఝామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 300 మంది ముష్కరులు హతమైనట్టు సమాచారం. అంతేకాదు భారత వైమానిక దాడులతో పాకిస్థాన్ బెంబెలెత్తిపోతుంది. ఈ దాడిపై టాలీవుడ్‌కు చెందిన ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ సహా పలువురు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా భారత వాయుసేనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ.. పాక్ ముష్కర మూకలపై భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్‌పై తనదైన శైలిలో స్పందించారు. మేరా భారత్ మహాన్..జై హింద్ అంటూ భారత జవాన్లకు అభినందించారు.
మరోవైపు టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో ప్రభాస్ కూడా భారత వాయు సేనను బిగ్ సెల్యూట్ అంటూ పొగిడారు.
ఇంకోవైపు హీరో కళ్యాణ్ రామ్, రామ్, రవితేజ, నిఖిల్‌లు కూడా భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రైక్‌ను ప్రశంసించారు.
#IndiaStrikesBack and how! It is time the world knows that we will not sit back. Hearty congratulations to the #IndianAirForce. #JaiHind
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) February 26, 2019
Extremely PROUD 🙏🏻 Salutes to the #IndianAirForce 🙏🏻
JAI HIND🇮🇳
— Ravi Teja (@RaviTeja_offl) February 26, 2019
Cheppinam...Vinley...Salute to the planning and execution of the #IndianAirForce #jaihind
— RAm POthineni (@ramsayz) February 26, 2019
Great job @IAF_MCC #jaihind 🇮🇳 pic.twitter.com/tDPNlJ4WWz
— Nikhil Siddhartha (@actor_Nikhil) February 26, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Kalyan Ram Nandamuri, Narendra modi, Nikhil Siddharth, Pm modi, Prabhas, Pulwama Terror Attack, Ram Pothineni, Raviteja, Surgical Strike 2, Tollywood