హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna: బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన SVR మనవళ్లు.. ఇంతకీ ఏమన్నారంటే..

Balakrishna: బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన SVR మనవళ్లు.. ఇంతకీ ఏమన్నారంటే..

బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన SVR మనవళ్లు (Twitter/Photo)

బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన SVR మనవళ్లు (Twitter/Photo)

Balakrishna: వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అలనాటి అందాల నటుడు అక్కినేని నాగేశ్వరరావు పై అక్కినేని, తొక్కినేని.. ఆ రంగారావు, ఈ రంగారావు అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై వివాదాలు చెలరేగాయి.తాాజగా ఈ వివాదంపై అక్కినేని మనవళ్లు స్పందించారు. తాజాగా ఈ ఇష్యూ పై SVR మనవళ్లు స్పందించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Balakrishna: బాలయ్య నటించిన లేటెస్ట్ చిత్రం వీరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని గోపిచంద్ మలినేని తెరకెక్కించారు.  శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. ఫ్యాక్షన్-చెల్లెలి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య నటనకు మరోసారి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సక్సెస్ మీట్ లో అలనాటి అందాల నటులు అక్కినేని నాగేశ్వరరావు పై అక్కినేని, తొక్కినేని.. ఆ రంగారావు, ఈ రంగారావు  అంటూ చేసిన కామెంట్స్ పై వివాదాలు చెలరేగాయి. ఇక బాలయ్య కూడా నాన్న ఎన్టీఆర్ తర్వాత అక్కినేనిని బాబాయి అంటూ సంబోధిస్తూ ఉండేవారు. అలాంటాయనపై బాలయ్య ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను దుమారమే రేగుతోంది. అయితే నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య ఏదో సరదాగా అన్నారు. దీన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక బాలయ్య బోళా మనిషి.. ఆయన లోపల ఒకటి పెట్టుకొని.. బయట వేరే మాటలు అనే వ్యక్తి కాదంటూ ఆయన అభిమానులు వెనకేసుకొస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేయడం బాగా లేదంటున్నారు. దీనిపై ఇప్పటికే అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చేలా ఓ ట్వీట్ చేసారు.”నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అలాగే ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం” అంటూ అక్కినేని నాగచైతన్య ట్వీట్ చేశారు.అటు అఖిల్ అక్కినేని కూడా సేమ్ టు సేమ్ ఇదే ట్వీట్ చేశారు. ఈ వివాదంపై బాలయ్య మాత్రం అసలు స్పందించలేదు. తాజాగా బాలయ్య వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై SVR మనవళ్లు స్పందించారు.

నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీఆర్ కుటుంబ సభ్యులుగా మనవళ్లుగా మేము ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాము. మాకు, బాలకృష్ణగారికి మంచి అనుబంధం ఉంది. మేమంత ఒకే కుటుంబంగా ఉంటాము. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్‌గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా ఫ్యామిలీ మెంబర్స్‌కు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో కూడా ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయవద్దన్నారు

బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన ఎస్వీఆర్ మనవళ్లు (Twitter/Photo)

ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి , నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నామంటూ విన్పవించుకున్నారు  ఆయన మనవళ్లు జూనియర్ ఎస్వీఆర్  ఎస్.వి.ఎల్.ఎస్.రంగారావు (బాబాజీ) ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మొత్తంగా ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Balakrishna, Balayya, Veera Simha Reddy

ఉత్తమ కథలు