బాలకృష్ణ ‘లాయర్ సాబ్’ అవుతున్నాడా.. అమితాబ్ సినిమాలో నటసింహం..

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఉన్నట్లుండి గ్యాప్ తీసుకున్నాడు బాలయ్య. ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్నా కూడా ఎన్నికల పుణ్యమా అని వాటి జోలికి వెళ్లలేదు. పైగా ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడం ఈయన తట్టుకోలేకపోతున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 6, 2019, 10:32 AM IST
బాలకృష్ణ ‘లాయర్ సాబ్’ అవుతున్నాడా.. అమితాబ్ సినిమాలో నటసింహం..
బిగ్‌ బీ ‘పింక్’ రీమేక్‌లో బాలకృష్ణ ?
  • Share this:
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఉన్నట్లుండి గ్యాప్ తీసుకున్నాడు బాలయ్య. ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్నా కూడా ఎన్నికల పుణ్యమా అని వాటి జోలికి వెళ్లలేదు. పైగా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా డిజాస్టర్ కావడాన్ని కూడా బాలయ్య అంత ఈజీగా తీసుకోలేకపోయాడు. దాంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు ఈయన. ఇక ఇప్పుడు వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు బాలయ్య. ఈ చిత్రం షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది.
Balakrishna will be going to act in Pink movie telugu remake produced by Dil Raju pk ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఉన్నట్లుండి గ్యాప్ తీసుకున్నాడు బాలయ్య. ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్నా కూడా ఎన్నికల పుణ్యమా అని వాటి జోలికి వెళ్లలేదు. పైగా ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడం ఈయన తట్టుకోలేకపోతున్నాడు. Balakrishna,Balakrishna twitter,Balakrishna instagram,Balakrishna pink remake,Balakrishna ajith movie,Balakrishna amitab movie,Balakrishna dil raju,Balakrishna movies,Balakrishna ks ravikumar movie,telugu cinema,Balakrishna taapsee movie,బాలకృష్ణ,బాలకృష్ణ పింక్ రీమేక్,బాలకృష్ణ దిల్ రాజు,తెలుగు సినిమా
బాలయ్య కేఎస్ రవికుమార్

ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ సెన్సేషనల్ సినిమా చేయడానికి బాలయ్య ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తుంది. హిందీలో సంచలన విజయం సాధించిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య హీరో అయితే బాగుంటుందని భావిస్తున్నారు మేకర్స్. తమిళనాట అజిత్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు.

Balakrishna will be going to act in Pink movie telugu remake produced by Dil Raju pk ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఉన్నట్లుండి గ్యాప్ తీసుకున్నాడు బాలయ్య. ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్నా కూడా ఎన్నికల పుణ్యమా అని వాటి జోలికి వెళ్లలేదు. పైగా ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడం ఈయన తట్టుకోలేకపోతున్నాడు. Balakrishna,Balakrishna twitter,Balakrishna instagram,Balakrishna pink remake,Balakrishna ajith movie,Balakrishna amitab movie,Balakrishna dil raju,Balakrishna movies,Balakrishna ks ravikumar movie,telugu cinema,Balakrishna taapsee movie,బాలకృష్ణ,బాలకృష్ణ పింక్ రీమేక్,బాలకృష్ణ దిల్ రాజు,తెలుగు సినిమా
బాలయ్య ఫైల్ ఫోటో

ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో దిల్‌ రాజు నిర్మాతగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు లాయర్‌ సాబ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రానుంది. హిందీలో ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించాడు. అమ్మాయిలకు అన్యాయం జరిగే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మరి తెలుగులో బాలయ్య చేస్తే ఎలా ఉంటుందనేది చూడాలి.

First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>