Balakrishna Watched F3 Movie | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. తాజాగా ఈ సినిమా ఎఫ్ 3 దర్శకుడు, నిర్మాతలతో కలిసి బాలయ్య ఈ సినిమాను వీక్షించారు.
Balakrishna Watched F3 Movie | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’. ఈ నెల 27న విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆద్యంతం కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. దీంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూసేందకు ఎగబడుతున్నారు. అనిల్ రావిపూడి కేవలం ఈ సినిమా టైటిల్‌ను మాత్రమే వాడుకొని అవే పాత్రలతో ఎఫ్ 3 మూవీని తెరకెక్కించారు. పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించిన ఈ మూవీ చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఆడియన్స్. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రేక్షకులకు ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు.
తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ వీక్షించారు. అనిల్ రావిపూడి.. ఎఫ్ 3 మూవీ తర్వాత తన నెక్ట్స్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా షో వేసారు. ఈ సినిమాను చూసిన బాలయ్య ఆద్యంతం నవ్వులతో మునిగిపోయారట. అంతేకాదు ఇంత మంది కామెడీ ఫ్యామిలీ ఎంటర్టేనర్ తెరకెక్కించిన చిత్ర దర్శక, నిర్మాతలను అభినందించారట. ఇక అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాను జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.
ఎఫ్ 3 దర్శక,నిర్మాతలతో కలిసి సినిమా వీక్షించిన బాలయ్య (Twitter/Photo)
అనిల్ రావిపూడి విషయనికొస్తే.. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. .ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా.. అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 45 కోట్ల షేర్.. (రూ. 75 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్‌గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో బ్లాక్ లుంగీలో పక్కన పెద్ద బండి పక్కన ఎంతో మాస్‌గా ఉంది. ఈ సినిమాకు ‘పెద్దాయన,’ తో పాటు అన్నగారు, వేట పాలెం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో ఏది కన్ఫామ్ చేస్తారో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.