ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే టాలీవుడ్‌లో విభేదాలు..

ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ (File/Photo)

బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలు.. తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద సంచలనమే క్రియేట్ చేసారు. ఈ విభేదాలు, చిరంజీవి, బాలయ్య మధ్యనే అనుకుంటే పొరపాటు. సినీ ఇండస్ట్రీ ఎపుడు ఒక్కటిగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ.

  • Share this:
బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలు.. తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చల విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద సంచలనమే క్రియేట్ చేసారు. ఇదంతా చూసి ఒకే కుటుంబం అని చెప్పుకునే టాలీవుడ్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ విభేదాలు, చిరంజీవి, బాలయ్య మధ్యనే అనుకుంటే పొరపాటు. సినీ ఇండస్ట్రీ ఎపుడు ఒక్కటిగా ఉన్న సందర్భాలు చాలా తక్కువ. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య కూడా మనస్పర్ధలు ఉండేవి. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు.అప్పట్లో ఎన్టీఆర్,ఎన్నార్ ఏదో ఇష్యూ వచ్చి జమునతో నటించకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పట్లో నాగిరెడ్డి, చక్రపాణి.. ఎన్టీఆర్, ఏఎన్నార్, జమునల మధ్య రాజీ కుదిర్చి ‘గుండమ్మకథ’ లో జమునను హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్పీఆర్ (File/Photo)


ఆ సంగతి పక్కనపెడితే.. అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు వచ్చాయి. అప్పట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. కృష్ణ.. అప్పట్లో విజయ నిర్మలతో కలిసి ఎన్నార్ ఆల్ టైమ్ క్లాసిక్ .. దేవదేసు’ సినిమాను సినిమా స్కోప్‌లో రీమేక్ చేసారు. అదే టైమ్‌లో ఎన్టీఆర్ ..పాత దేవదాసు రైట్స్ తీసుకొని ఒక వారం ముందుగా మళ్లీ రీ రిలీజ్ చేసారు. మ్యూజికల్‌గా మంచి పాటలున్న కృష్ణ, విజయ నిర్మల దేవదాసు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కృష్ణ..కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి.. ఎన్టీఆర్ పై సెటైరికల్ మూవీస్ చేసి ఎన్టీఆర్‌కు సవాల్ విసిరారు.

balakrishna vs chiranjeevi tollywood issues before ntr anr krishna time,.balakrishna,chiranjeevi,balakrishna vs chiranjeevi,chiru,balayya,ntr,anr,ntr vs anr,ntr vs krishna,krishna,jr ntr,balakrishna youtube interview,balakrishna about jr ntr,balayya about jr ntr,balayya about jr ntr political entry,balayya youtube interview,janatha garage,balakrishna jr ntr janatha garage,rrr,rrr jr ntr,Simhadri,balakrishna jr ntr Simhadri,balakrishna rejected simhadri movie,rajamouli,balakrishna nandamuri ss rajamouli,vijayendra prasad,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,rajamouli instagram,rajamouli twitter,rajamouli facebook,jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,ss rajamouli,#balakrishna,ss rajamouli about balakrishna,balakrishna nandamuri (film actor),s s rajamouli,rajamouli movies,ss rajamouli interview,balakrishna rajamouli,balakrishna movies,rajamouli sensational comments on balakrishna,balakrishna rajamouli movie,balakrishna meeting rajamouli,balakrishna new movies,balakrishna interview,balakrishna rajamouli movie latest updates,tollywood,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ రాజమౌళి,ఎస్ఎస్ రాజమౌళి,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్,సింహాద్రి,సింహాద్రి ఎన్టీఆర్ బాలకృష్ణ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జనతా గ్యారేజ్,బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్,ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు,ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై బాలయ్య వ్యాఖ్యలు,బాలకృష్ణ ఎన్టీఆర్,ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలకృష్ణ కామెంట్స్,చిరంజీవి,ఎన్టీఆర్,ఏఎన్నార్,ఎన్టీఆర్ వర్సెస్ ఏఎన్నార్,అక్కినేని వర్సెస్ నందమూరి,కృష్ణ వర్సెస్ ఎన్టీఆర్
ఎన్టీఆర్‌తో కృష్ణ (Twitter/Photo)


ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఎన్నార్‌తో అన్నపూర్ణ స్టూడియో విషయంలో గొడవలు చెలరేగాయి. అప్పట్లో సీఎంగా ఉన్న ఎన్టీఆర్.. అక్కినేనికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోలు గోడలను బుల్డోజర్‌తో పడగొట్టించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత వాళ్లిద్దరు మళ్లీ ఒకటైపోయారు. ఇక ఎన్టీఆర్, కృష్ణ కూడా ఆ తర్వాత మళ్లీ కలిసిన సందర్భాలున్నాయి.  ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మధ్య ఎన్ని గొడవలు ఉన్న వీళ్లు సినిమాల్లో కలిసి నటించిన సందర్భాలున్నాయి. ఇక ఇపుడు బాలకృష్ణ, చిరంజీవి మధ్య ఉన్న గొడవలు కూడా అలాంటివే. ఇక బాలయ్యకు, నాగార్జునకు కూడా ఓ విషయంలో విభేదాలు వచ్చాయి. గత  కొన్నాళ్లుగా వీళ్లు అంత సఖ్యంగా లేరనే మాట ఇండస్ట్రీలో వినబడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ఈ విభేదాలన్ని టీ కప్పులో తుపాను లాంటివే. ఈ విభేదాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్తేం కాదు. మొత్తంగా చూసుకుంటే ఈనాటి విభేదాలు ఏనాటివో అనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published: