Balakrishna - Ravi Teja : నందమూరి నట సింహం బాలకృష్ణ.. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈయన ‘అఖండ’ మూవీతో అఖండమైన విజయం అందుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో కెరీర్లో తొలిసారి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకొని హీరోగా తన సత్తా చాటారు. ప్రస్తుతం బాలయ్య.. ఆహా ఓటీటీ కోసం హోస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్గా పుష్ప టీమ్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్నతో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ అదిరిపోయింది.
తాజాగా ఈయన మాస్ మహారాజ్, దర్శకుడు గోపీచంద్ మలినేనిలను తన షోలో ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేసిన ఆహా టీమ్ మరో ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో గోపీచంద్ మలినేని బాలయ్య, రవితేజలకు ఓ తాడు ఇచ్చి.. మీరిద్దరిలో మీ భార్య అంటే షేక్ మస్తాన్.. అని ప్రశ్నించారు. మీలో మీ భార్యకు ఎవరు మీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పారు అంటూ గోపీచంద్ మలినేని అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ, రవితేజల ఆన్సర్ అదిరిపోయేలా ఉంది ప్రోమో.
Entertainment is the only winner in this tug-of-war between stars! ?#UnstoppableWithNBK Episode 7 Premieres tomorrow at 8 PM. #NandamuriBalakrishna @RaviTeja_offl @megopichand #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd #CellPoint pic.twitter.com/xlPbe7gdmV
— ahavideoIN (@ahavideoIN) December 30, 2021
ఐతే.. ముందుగా రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో బాలయ్య ఈ షోను మనం మొదలు పెట్టే ముందు బాసు ఓ క్లారిటీ ఇచ్చుకోవాలి. నీకు, నాకు పెద్ద గొడవ అయిందటగ. అవును పనీ పాటా లేని డాష్ నా డాష్ గాళ్లకు ఇదే పని అంటూ రవితేజ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తమ (బాలయ్య, రవితేజ) మధ్య జరిగినట్టు చెబుతున్న తగాదా ఉత్తిదే అని తేల్చేశారు.
Year Ender 2021 : ఈ యేడాది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని వేడెక్కించిన వివాదాలు..
ఈ సందర్భంగా రవితేజను నీకు కోసం వచ్చినపుడు సరదాగా చెప్పే నాలుగు బూతులు చెప్పు. నేను బూతులు మొదలు పెడితే.. ప్రేక్షకులు చస్తారంటూ నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు రవితేజ. అతి వినయం ధూర్త లక్షణం. చేతులు కట్టుకుంటే డిప్ప పగిలిపోతుందంటూ రవితేజకు బాలయ్యకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అవతల వాడి బిహేవియర్ బట్టి వీడు తేడా అనే విషయం తెలిసిపోతుంది కదా మీకు. లేకపోతే చంప ఛల్లుమనాల్సిందే అంటూ రవితేజ నవ్వించారు.
Year Ender 2021 : అఖండ, ఉప్పెన, జాతి రత్నాలు సహా 2021లో లాభాలు తీసుకొచ్చిన సినిమాలు..
మొగల్రాజ పురం అమ్మాయిలకు లైన్ వేసేవాడివంటూ బాలయ్య అడిగిన ప్రశ్నకు రవితేజ అవాక్కయ్యారు. దీనికి బాలయ్య కలగజేసుకొని తప్పేంటయ్యా.. నేను చిన్నపుడు అమ్మాయిలకు లైన్ వేసేవాడినన్నారు. ఇక బాలయ్య అడిగిన ఈ ప్రశ్నలకు రవితేజ మాట్లాడుతూ.. నా గురించి మీకు ఈ విషయాలు ఎలా తెలుసు. ఎవరిచ్చారన్న రవితేజ ప్రశ్నకు బాలయ్య మాది కృష్ణా జిల్లా అని చెప్పడం హట్ టాపిక్‌గా మారింది. ఈ షోలో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ ఈ రోజు రాత్రి. 8 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Gopichand malineni, Ravi Teja, Tollywood, Unstoppable NBK