Balakrishna - Trivikram: బాలకృష్ణ,త్రివిక్రమ్ కాంబినేషన్ ? అసలు నిజమెంత ?

బాలకృష్ణ,త్రివిక్రమ్ (Twitter/Photo)

Balakrishna - Trivikram: ప్రస్తుతం టాలీవుడ్‌లో నందమూరి నట సింహా బాలకృష్ణ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై పెద్ద చర్చే నడుస్తోంది.

  • Share this:
    Balakrishna - Trivikram: ప్రస్తుతం టాలీవుడ్‌లో నందమూరి నట సింహా బాలకృష్ణ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై పెద్ద చర్చే నడుస్తోంది. అవును సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు భలే క్రేజ్ ఉంటుంది. ఇక త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఓ సినిమా చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా బాలయ్య ‘ఆదిత్య 369’ (Aditya 369) మూవీ 30 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా తాను చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.

    మాములుగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో (Haarika & Hassine Creations) త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే సినిమాలు మాత్రమే తెరకెక్కిస్తారు. వేరే దర్శకుడు తెరకెక్కించే చిత్రాలు మాత్రం సితార ఎంటర్టైన్మెంట్‌లో తెరెక్కిస్తూ ఉంటారు. మరి బాలయ్య.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో చేయబోయే సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతుందా లేదా అనేది చూడాలి.

    Balakrishna Trivikram Srinivas Intresting Rumours About Balayya Trivikram Movie Tollywood Here Are The Details,Balakrishna - Trivikram: బాలకృష్ణ,త్రివిక్రమ్ కాంబినేషన్ ? అసలు నిజమెంత ?,Balakrishna Trivikram Srinivas,Balakrishna,Trivikram,Balakrishna Instagram,Balakrishna Twitter,Balakrishna Facebook,Balakrishna Akhanda Movie,Trivikram Movie With Balakrishna Nandamuri,Tollywood,Telugu cinema,బాలకృష్ణ నందమూరి,బాలయ్య,బాలయ్య త్రివిక్రమ్ శ్రీనివాస్,బాలకృష్ణ త్రివిక్రమ్,బాలకృష్ణ త్రివిక్రమ్ కాంబినేషన్,త్రివిక్రమ్ బాలకృష్ణ కాంబినేషన్
    బాలకృష్ణ,త్రివిక్రమ్ (Twitter/Photo)


    ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా బాలయ్య  ట్రెండ్‌కు తగ్గట్టు టాప్ డైరెక్టర్లు, పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లకు సంబంధించిన  సినిమాలను ఓకే చేస్తున్నారు. తాజాగా త్రిక్రమ్ ఆస్థాన బ్యానర్ ‘హారికా అడ్ హాసిని క్రియేషన్స్‌లో బాలయ్య సినిమా ఓకే చేయడం ఇపుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

    Balakrishna Trivikram Srinivas Intresting Rumours About Balayya Trivikram Movie Tollywood Here Are The Details,Balakrishna - Trivikram: బాలకృష్ణ,త్రివిక్రమ్ కాంబినేషన్ ? అసలు నిజమెంత ?,Balakrishna Trivikram Srinivas,Balakrishna,Trivikram,Balakrishna Instagram,Balakrishna Twitter,Balakrishna Facebook,Balakrishna Akhanda Movie,Trivikram Movie With Balakrishna Nandamuri,Tollywood,Telugu cinema,బాలకృష్ణ నందమూరి,బాలయ్య,బాలయ్య త్రివిక్రమ్ శ్రీనివాస్,బాలకృష్ణ త్రివిక్రమ్,బాలకృష్ణ త్రివిక్రమ్ కాంబినేషన్,త్రివిక్రమ్ బాలకృష్ణ కాంబినేషన్
    ‘అరవింద సమేత వీరరాఘవ’ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Twitter/Photo)


    ప్రస్తుతం త్రివిక్రమ్ .. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారు. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  మరోవైపు బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది.

    Balakrishna Trivikram Srinivas Intresting Rumours About Balayya Trivikram Movie Tollywood Here Are The Details,Balakrishna - Trivikram: బాలకృష్ణ,త్రివిక్రమ్ కాంబినేషన్ ? అసలు నిజమెంత ?,Balakrishna Trivikram Srinivas,Balakrishna,Trivikram,Balakrishna Instagram,Balakrishna Twitter,Balakrishna Facebook,Balakrishna Akhanda Movie,Trivikram Movie With Balakrishna Nandamuri,Tollywood,Telugu cinema,బాలకృష్ణ నందమూరి,బాలయ్య,బాలయ్య త్రివిక్రమ్ శ్రీనివాస్,బాలకృష్ణ త్రివిక్రమ్,బాలకృష్ణ త్రివిక్రమ్ కాంబినేషన్,త్రివిక్రమ్ బాలకృష్ణ కాంబినేషన్
    బాలకృష్ణ,త్రివిక్రమ్ (Twitter/Photo)


    ఈ సినిమా తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడితో పాటు ఆదిత్య 999 మాక్స్‌తో పాటు తమిళ దర్శకుడు హరితో ఓ సినిమా చేయనున్నారు. దాంతో పాటు యువ దర్శకులు వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి సినిమాలకు ఓకే చెప్పినట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: