బాలకృష్ణ..తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. దీంతో నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఆల్రెడీ బోయపాటి శ్రీను ఒక సినిమాకు కమిటైనా.. ఈ మూవీ స్టోరీ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతోొ ముందుగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసాడు. తొందర్లోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. గత కొన్నేళ్లుగా దర్శకుడిగా కే.యస్.రవికుమార్ ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఐనా..బాలయ్య కే.యస్.రవికుమార్ ను నమ్మి గతంలో ‘జై సింహా’ సినిమా చేసాడు. ఈ సినిమా ఓ మోస్తరుగా పర్వాలేదనిపించింది. తాజాగా ఇపుడు తెరకెక్కేబోయే ఈ సినిమాలో బాలయ్య మరోసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభియం చేస్తున్నట్టు సమాచారం. గతంలో బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే కదా.
ఇపుడు చేయబోయే సినిమాలో బాలయ్య ఎస్పీ క్యారెక్టర్‌లో మరోసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్నాడు.గతంలో బాలయ్య ఖాకీ డ్రెస్ వేసుకున్న అత్యధిక చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలనే అందుకున్నాయి. అందుకే ఇపుడు మరోసారి కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో పోలీస్ డ్రెస్ వేసుకోవడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడు.గతంలో బాలకృష్ణ, బోయాపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ..సౌత్ ఇండియాలోనే మోస్ట్ స్టైలిష్ విలన్‌గా పాపులర్ అయ్యాడు.
తొందర్లోనే సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమాను కుదిరితే దసరాకు లేకపోతే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నట్టు సమాచారం. మరి ఖాకీ డ్రెస్‌లో జగపతిబాబును ఢీ కొట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్యను కే.యస్. .రవికుమార్ ఏ రేంజ్‌లో చూపెడతాడోొ చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Balakrishna, Boyapati Srinu, Jagapati Babu, K. S. Ravikumar, Telugu Cinema, Tollywood