Balakrishna : తెలంగాణ పోరాట యోధుడి పాత్రలో బాలకృష్ణ.. ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తోన్న నట సింహం..

Balakrishna : బాలయ్య తండ్రిలాగే సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక జానర్స్‌లో నటించి మెప్పించాడు.

news18-telugu
Updated: October 30, 2020, 11:00 AM IST
Balakrishna : తెలంగాణ పోరాట యోధుడి పాత్రలో బాలకృష్ణ.. ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తోన్న నట సింహం..
బాలయ్య Photo : Twitter
  • Share this:
నందమూరి నట సింహం బాలకృష్ణది నటనలోగానీ లేదా ప్రవర్తనలో గానీ ప్రత్యేక శైలి. ఆయన సినిమాల ఎంపిక కూడా ప్రత్యేకంగా ఉంటుంది. బాలయ్య తండ్రిలాగే సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక జానర్స్‌లో నటించి మెప్పించాడు. బాలయ్య ఏ పాత్ర చేసినా దాంట్లో తనదైన శైలిని చూపిస్తాడు. బాలయ్యకు పౌరాణిక, చారిత్రాత్మక సినిమాలన్న.. అలాంటీ పాత్రలన్న చాలా ఇష్టం. అందులో భాగంగా ఆయన ఆ మధ్య క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న బాలయ్య తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ మరో చారిత్రాత్మక పాత్రపై తాజాగా దృష్టి పెట్టినట్టు సమాచారం. తెలంగాణ పోరాటయోధుడు, కాకతీయ రుద్రమ కాలం నాటి వీరుడు గోన గన్నారెడ్డి పాత్రలో బాలయ్య కనిపించనున్నాడని తెలుస్తోంది. బాలయ్య ఈ పాత్రలో నటించాలనీ కోరుకుంటున్నాడట. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనికోసం కొందరు రచయితల బృందాన్ని ఏర్పాటు చేశాడట బాలయ్య. కాగా ఇదే పాత్రలో అల్లు అర్జున్ గతంలో నటించిన సంగతి తెలిసిందే. గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోనా గన్నారెడ్డి పాత్రలో కనిపించి అదరగొట్టాడు. అయితే అది గెస్ట్ రోల్ మాత్రమే.

ఇక బాలయ్య ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ పేరును కన్ఫర్మ్ చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రగ్యా మార్టిన్ మలయాళంలోనే కాకుండా తమిళంలో కూడ పలు సినిమాల్లో నటించింది. తమిళంలో ఆమె మొదటి చిత్రం మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ‘పిశాసు’. ఈ సినిమా తెలుగులో పిశాచిగా డబ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె బెస్ట్ డెబ్యూ నటిగా అవార్డ్ కూడ దక్కింది. ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’.. 'సింహ'ను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ తాజా సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ Photo : Twitter


కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని సడలింపులతో అనుమతులు ఇవ్వడంతో తాజాగా షూటింగ్‌ను పున: ప్రారంభిచింది. కరోనా కారణంగా ఆలస్యం కావడంతో ఈ సినిమాను సింగిల్ షెడ్యూలులో షూటింగ్ మొత్తం పూర్తి చేసేస్తారని సమాచారం. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించునేందుకు ప్రయత్నిస్తోందట. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సంస్థ ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: October 30, 2020, 10:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading