Home /News /movies /

BALAKRISHNA TO DO A TALK SHOW FOR AHA WITH CRAZY CONCEPT HERE ARE THE DETAILS SR

Balakrishna : బాలయ్య కొత్త అవతారం.. ఆహా కోసం క్రేజీ కాన్సెప్ట్‌తో వస్తున్న నందమూరి నట సింహం..

Balakrishna for Aha Photo : Twitter

Balakrishna for Aha Photo : Twitter

Balakrishna | Akhanda : నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం ఓ టాక్ షో చేస్తున్నారని తెలుస్తోంది. ఈ షోను ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తోందట. బాలకృష్ణ ఇలాంటి ఒక షో ఒప్పుకోవడమే ఆశ్చర్యకరంగా మారగా ఇందులో వచ్చే గెస్ట్ లు కూడా మరింత స్పెషల్ గా ఉంటారని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుందని చిత్రబృందం తెలిపింది. దీంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్ని ముమ్మురం చేసింది. త్వరలో విడుదల తేది విషయంలో క్లారిటీ రావోచ్చు. అఖండ టీమ్ ఈ విషయంలో ఓ ప్రకటన చేయనుంది. ఇక అది అలా ఉంటే బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం ఓ టాక్ షో చేస్తున్నారని తెలుస్తోంది. ఈ షోను ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తోందట. బాలకృష్ణ ఇలాంటి ఒక షో ఒప్పుకోవడమే ఆశ్చర్యకరంగా మారగా ఇందులో వచ్చే గెస్ట్ లు కూడా మరింత స్పెషల్ గా ఉంటారని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక సమాచారం విడుదలకానుంది. ఇక గతంలో ఇదే తరహాలో ఆహా యాప్ కోసం సమంత, రానాలు టాక్ షోలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

  ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న అఖండ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపోందిస్తున్నారు బోయపాటి శ్రీను. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గడంతో గతకొద్ది రోజులుగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. కాగా తాజాగా ఆ షెడ్యూల్‌ కూడా పూర్తి అయ్యింది. దీంతో ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

  Love Story 11 days WW Collections: ‘లవ్ స్టోరి’ 11 డేస్ కలెక్షన్స్.. భారీ లక్ష్యం చేధించిన నాగ చైతన్య, సాయి పల్లవి..

  ఇప్పటికే ఈ సినిమా నుంచి అడిగా అడిగా అంటూ విడుదల చేసిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.   ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా  జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ  సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అయితే దీపావళీకి రజనీకాంత్ అన్నాత్తే కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

  ఈ సినిమాను ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా నుంచి ఉగాది సందర్భంగా ఓ టీజర్‌‌ను విడుదల చేయగా.. ఆ టీజర్ మంచి ఆదరణ పొందింది. దీనికి తోడు ‘సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ అఖండ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అందులో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది.

  Pushpa - Rashmika Mandanna : ‘పుష్ప’ మూవీ నుంచి మరో క్రేజీ అప్టేట్‌కు టైమ్ ఫిక్స్..

  ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడు అయ్యాయని... సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

  Keerthy Suresh : ఎరుపు రంగు చీరలో పిచ్చెక్కించిన కీర్తి సురేష్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

  ఇక అఖండ దాదాపు పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టే ఆలోచనో ఉన్నారట. క్రాక్ డైరక్టర్ గోపీచంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

  గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష  (Trisha Krishnan ) నటించనుందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Aha OTT Platform, Balakrishna, Tollywood news

  తదుపరి వార్తలు