• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BALAKRISHNA TAKEN A FINAL DECISION ABOUT HIS SON MOKSHAGNA MOVIE DEBUT HERE THE FULL STORY PK

Balakrishna - Mokshagna: మోక్షజ్ఞ కోసం బాలయ్య బ్రహ్మాస్త్రం.. వర్కవుట్ అయితే పండగే..!

Balakrishna - Mokshagna: మోక్షజ్ఞ కోసం బాలయ్య బ్రహ్మాస్త్రం.. వర్కవుట్ అయితే పండగే..!

నందమూరి బాలకృష్ణ,మోక్షజ్ఞ (Balakrishna Mokshagna)

Balakrishna - Mokshagna: ఇండస్ట్రీలో హీరోల వారసులంతా ఇప్పటికే దాదాపు అంతా వచ్చేసారు. నందమూరి వంశం నుంచి ఒక్క బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మాత్రమే మిగిలిపోయాడు. ఈయన డెబ్యూ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి..

  • Share this:
ఇండస్ట్రీలో హీరోల వారసులంతా ఇప్పటికే దాదాపు అంతా వచ్చేసారు. నందమూరి వంశం నుంచి ఒక్క బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మాత్రమే మిగిలిపోయాడు. ఈయన డెబ్యూ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి సమచారం అయితే రాలేదు. బాలయ్య కూడా ఎప్పటికప్పుడు తనయుడి సినిమా గురించి చెబుతున్నాడు కానీ అక్కడ్నుంచి మాత్రం ఆసక్తి కనిపించడం లేదు. నందమూరి మోక్షజ్ఞ అసలు నటనపై ఆసక్తి చూపించడం లేదనే వార్తలు కూడా వస్తుండటంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఆయన బిజినెస్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ విషయంలో బాలయ్య మాత్రం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడంటే కరోనా ఉంది కాబట్టి మరికొన్ని రోజుల తర్వాత అయినా ఇదే నిర్ణయం అప్లై చేయాలని చూస్తున్నాడు. నిజానికి 2020లోనే ఇది చేయాలని చూసినా కుదర్లేదు. అదేంటంటే.. ఈయన తన కొడుకును అమెరికా పంపించాలని చూస్తున్నాడు. న్యూయార్క్‌లో ఉన్న లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్‌లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళే విధంగా బాలయ్య మోక్షజ్ఞను ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడికి వెళ్తే అయినా నటనపై ఆసక్తి కలుగుతుందని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తుంది.

బాలకృష్ణతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna Balakrishna)
బాలకృష్ణతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna Balakrishna)


అంతేకాదు అమెరికా నుంచి వచ్చిన తర్వాత తన సినిమా షూటింగ్‌కు కూడా కొడుకును తీసుకురావాలని బాలయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటికీ మోక్షు మాత్రం తన మనసులో బిజినెస్ ఆలోచనలే ఉన్నట్లు చెబుతున్నాడని సన్నిహితులు చెబుతున్న మాట. ఎలాగైనా కూడా మోక్షజ్ఞ మనసు బిజినెస్ నుంచి సినిమాల వైపు మార్చేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు బాలయ్య. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి రావాల్సి ఉంది కానీ ఆయన మాత్రం నటనపై ఆసక్తి చూపించడం లేదనే వార్తలు రావడంతోనే ఇన్నాళ్ళూ ఆలస్యమవుతుందని తెలుస్తుంది.

బాలకృష్ణతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna Balakrishna)
బాలకృష్ణతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna Balakrishna)


తన కొడుకు కోసం భారీగానే లాంఛ్ ప్లాన్ చేస్తున్నా కూడా ఈయన మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఆఖరి ప్రయత్నంగా చేస్తున్న అమెరికా ఫిలిం ఇన్స్‌ట్యిట్యూట్ ప్రయోగం చేస్తున్నాడంటున్నారు నందమూరి సన్నిహితులు. దాంతో పాటు తన కొడుకు మోక్షును ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు చేతుల్లో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదైనా సక్సెస్ అయి మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వస్తాడా రాడా అనేది చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: