Home /News /movies /

BALAKRISHNA SUKUMAR AKHANDA FAME NANDAMURI BALAKRISHNA WARNED DIRECTOR SUKUMAR IN UNSTOPPABLE WITH NBK TALK SHOW HERE ARE THE DETAILS TA

Balakrishna - Sukumar : బాలకృష్ణకు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చాను.. అన్‌స్టాపబుల్ షోలో సుకుమార్ సంచలన నిజాలు..

బాలకృష్ణ,సుకుమార్ (Twitter/Photo)

బాలకృష్ణ,సుకుమార్ (Twitter/Photo)

Balakrishna - Sukumar : బాలకృష్ణకు సూపర్ హిట్స్ ఇచ్చాను సుకుమార్.. అన్‌స్టాపబుల్ షోలో సుక్కు సంచలన నిజాలు బయటపెట్టారు.

  Balakrishna - Sukumar : నందమూరి బాలకృష్ణ.. గత కొన్నేళ్లుగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ‘ఆహా’ కోసం హోస్ట్‌గా మారడం అసలు ఎవరు ఊహించలేదు. ఇక అన్‌స్టాపబుల్ విత్ NBKలో బాలయ్య హోస్టింగ్‌కు అభిమానులతో పాటు ప్రేక్షకులు, సెలబ్రిటీలు అందరూ ఫిదా అవుతున్నారు. బాలయ్య టాక్ ‘అన్‌స్టాపబుల్ షోతో ‘ఆహా’ ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్ మెంబర్స్ అమాంతం పెరిగారు. తాజాగా ఈ వారం ఈ టాక్ షోలో ‘పుష్ప’ టీమ్ మెంబర్స్ అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న ఈ షోకు విచ్చేసారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..  ఆయనకు, నాకు మధ్య పరిచయం  తక్కువే అంటూ కామెంట్ చేసారు. ప్రయత్నం చేద్దాం అంటూ అనా. సుకుమార్ దానికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.

  మీరు నాకు పరిచయం తక్కువే అయినా.. నాకు మీకు పరిచయం ఎక్కువే అంటూ సుకుమార్ ఆసక్తికర సమాధానమిచ్చారు. దానికి బాలయ్య అవాక్కయ్యారు. మీతో ప్రత్యక్షంగా కాకపోయినా.. ఎపుడు మిమ్మల్ని చూస్తూ పెరిగాను. దానికి బాలయ్య నా వయసు ఇప్పటికీ 16 అని చెప్పగా.. సుకుమార్ కల్పించుకోని మీ ఒక్కో ఇయర్ మాకు 10 యేళ్లతో సమాధానం ఇచ్చారు. దానికి బాలయ్య.. ఇంటర్‌స్టెల్లార్ కబుర్లు చెప్పకమ్మా అంటూ బాలకృష్ణ చెప్పడం నవ్వులు పూయించాయి.

  Mahesh Babu - Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ ఆత్మీయ కలయిక.. సెట్స్ పైకి వెళ్లేది ఎపుడంటే..


  ఇక యాక్టర్స్‌తో మీరు పనిచేయడం చూస్తుంటే.. కళా తపస్వీ కే.విశ్వనాథ్ గారు గుర్తుకు వస్తారు అంటూ సుకుమార్ ను బాలయ్య అభినందించారు. మీరు చేసే సినిమాల్లో పరకాయ ప్రవేశం చేస్తారా అనగానే.. నేను ఆర్టిస్టులతో పరకాయ ప్రవేశం చేయిస్తాను అంటూ సుకుమార్ చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా తమ ఊర్లో రెండు వర్గాలు. ఒకటి బాలయ్య వర్గం. రెండోది చిరంజీవి వర్గం.  ఇంట్లో నలుగురు అన్నదమ్ములం నేను అందరికంటే చిన్నవాణ్ని. మా ఇంట్లో పెద్దన్నయ్య మీ (బాలయ్య ఫ్యాన్) మరో ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి ఫ్యాన్. మా ఇంట్లో  పెద్ద అరుగు. ఒకవైపు చిరంజీవి ఫోటో.. మరోవైపు బాలకృష్ణ మీ ఫోటో ఉంటుందని చెప్పారు. బాలయ్య, చిరంజీవి సినిమాలు ఎవరివి రిలీజైన మా ఇంట్లో గొడవ గొడవగా ఉండేదని చెప్పారు.

  Salman Khan- Deepika Padukone : ఆ కారణాల వల్లే దీపికా పదుకొణే, సల్మాన్ ఖాన్ సినిమాల్లో యాక్ట్ చేయలేదా..


  ఇక నన్ను సినిమాకు తీసుకెళితే సినిమా సూపర్ హిట్ అని సుకుమార్ చెప్పారు. అలా నేను చూసిన మీ (బాలయ్య) సినిమాలు ఎన్నో హిట్టయ్యాయని చెప్పారు. ఇక ఫ్లాప్‌ మాటేమిటి అని బాలకృష్ణ అడగగా.. సుకుమార్ సమాధానాన్ని దాటవేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. నాతో సినిమా చేయకుండానే నా సినిమాలు చూసి సూపర్ హిట్స్ ఇచ్చారు సుకుమార్ తెలివి తేటలు చూసి నేర్చుకోండంటూ అభిమానులకు చెప్పారు.

  BalaKrishna : ఫ్యాన్స్‌ను భయపెడుతున్న బాలయ్య నిర్ణయం.. మరోసారి ఫామ్‌లోని దర్శకుడికి ఓకే చెప్పిన నట సింహా ..?


  ఇక సుకుమార్ మాట్లాడుతూ..  మా పెద్దన్నయ్య మిమ్మల్ని కలిసాడంటే ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. ఆయనకు నా తరుపున ఐ లవ్యూ చెప్పండి అంటూ బాలయ్య సుకుమార్‌కు చెప్పారు. ఇక హీరోలను నెంబర్ వన్ చేసే ఫార్ములాలు సుకుమార్‌కు తెలుసు అంటూ బాలయ్య కితాబు ఇచ్చారు. మీ సినిమాల్లో హీరోలంటే రాముడు మంచి బాలుడు కాకుండా.. కొంచెం నెగిటివ్‌గా చూపిస్తూ ఉంటారని బాలయ్య అడిగిన ప్రశ్నకు.. సుకుమార్.. ప్రతి మనిషిలో మంచితో పాటు చెబు కూడా ఉంటోంది. దాన్నే నేను సినిమాల్లో చూపిస్తూ ఉంటానన్నారు.

  HBD Salman Khan: హ్యాపీ బర్త్ డే సల్మాన్ ఖాన్.. సల్లూ భాయ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..


  ఓ రకంగా చూపిస్తూ ఉంటారు. ఇక మీ నుంచి ‘ఆరేసుకోబోయి.. పారేసుకున్నాను.. ఆకుచాటు పిందే తడిసే లాంటి సినిమాలు చేసే అవకాశం ఉందా... అని అడగగా.. మీరు అవకాశం ఇస్తే చేస్తానని సుకుమార్ అన్నారు. దానికి బాలయ్య మాట్లాడుతూ.. మీ కన్ఫ్యూజన్‌‌కు   నా క్లారిటీకి మూడు నెలలు చాలు.. దసరాకు ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టి.. క్రిస్మస్‌కు గుమ్మడికాయ.. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేద్దాం అన్నారు బాలయ్య. మరి బాలయ్యతో సుకుమార్ కాంబినేషన్ అంటే ఎలాంటి సబ్జెక్ట్‌తో చేస్తారా అనేది చూడాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Sukumar, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు